తెలంగాణాలో భారత్ బంద్ చాలా దూకుడుగా జరుగుతుంది. తెలంగాణా సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస పార్టీ నేతలు అందరూ కూడా ఈ బంద్ లో పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ బంద్ కి మద్దతు ప్రకటించారు. రైతుల కోసం ప్రతీ ఒక్కరు కూడా రోడ్డు ఎక్కారు. తెలంగాణా మంత్రులు అందరూ బంద్ లో పాల్గొన్నారు. ఇటీవల కేంద్రం తీసుక వచ్చిన రైతులకు నష్టం కలిగించే వ్యతిరేక వ్యవసాయ చట్టంను తక్షణమే రద్దుచేయాలని కోరుతూ రైతు సమాఖ్య తో పాటు , అన్ని కార్మిక సంఘాలు , వివిధ రాజకీయ పార్టీలు , ప్రభుత్వాలు ఈరోజు భారత్ బంద్ కు పిలుపుమేరకు ఆర్టీసి బస్సులను కూడా బంద్ చేసారు.

టీఆరెస్ నాయకులు , కార్యకర్తలు  - ఎల్బీనగర్ ప్రధాన రహదారి ( దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ ) వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , నిరసన ప్రదర్శనలు తెలియజేయడంతో , ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.  ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలతో కలసి కేంద్ర ప్రభుత్వం, మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వరి కంకుల తో నిరసన ప్రదర్శనలు నిర్వహించి , రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును  తక్షణమే రద్దు చేసి , రైతులకు మేలు చేసే  విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ నలుమూలలా కూడా బంద్ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. భారత్ బంద్ నేపధ్యంలో  పెద్ద ఎత్తున పోలీసులు కూడా హైదరాబాద్ లో భద్రత ఏర్పాటు చేసారు. ఈ బంద్ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: