ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. అయితే..  ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన తండ్రి మరణానికి కారకుడైన కొడుకుని పోలీసులు అరెస్టు చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఫరూక్నగర్ మండలంలోని దేవుని పల్లి గ్రామానికి చెందిన బాలయ్య తన తండ్రి నర్సింలు ను బైక్ మీద ఎక్కించుకుని బయలుదేరాడు. కొత్తూరు నుంచి కిషన్ నగర్ మీదుగా వెళ్తున్న సమయంలో.. అతి వేగంగా వాహనాన్ని నడిపాడు..


 ఈ క్రమంలోనే వాహనం మీద నియంత్రణ కోల్పోయిన బాలయ్య చివరికి అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఇక బైక్ వెనకాల కూర్చున్న తండ్రి తలకు  బలమైన గాయం అయ్యి  అక్కడికక్కడే చనిపోయాడు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును గమనించి ఇక ఆ తర్వాత కొడుకే  ఈ ప్రమాదానికి కారణమని భావించి అరెస్టు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ వాహనం నడిపి నిబంధనలను అతిక్రమించడమే కాదు తండ్రి మరణానికి కారణం అయ్యాడు అంటూ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.



 ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  అయితే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా తమ వాహనాలను ఇతరులకు ఇవ్వకుండా ఉండటం ఎంతో మంచిదని సూచిస్తున్నారు పోలీసులు. ఫ్రెండ్స్, బంధువులు తెలిసినవాళ్లకు  బైక్ లేదా కారును లాంటి ఇతర వాహనాలను అడిగితే సాధారణంగా కొంత మంది ఇస్తూ ఉంటారు. ఇక తీసుకెళ్లిన వారు  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన లేదా ఇంకేదైనా రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల చుట్టూ ప్రమాదం చుట్టుకునే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.  ఇతరులకు వాహనాలు ఇవ్వక పోవడం మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: