ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వివాదాలు ఒక కొలిక్కి రాకుండానే... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య తలెత్తింది. రాష్ట్రమంతా ప్రజలు ఈ విషయం గురించే చర్చిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు అధికార పార్టీ ఈ అంశంపై చొరవ చూపడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంలో... సీఎం జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై, ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయడం సంచలనంగా మారింది.

దీంతో  దీనిపై మరో చర్చ మొదలయ్యింది. ఈ లేఖ రాయడం పట్ల సీఎం జగన్ యొక్క లక్ష్యం ఏమిటి..?? దాని వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామమాత్రంగా ఈ లేఖతో స్పందించి చేతులు దులుపుకున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు.. సీఎం జగన్ సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. సీఎం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టే ప్రజల కోసం ప్రధానికి లేఖ రాశారని అంటున్నారు. ఫ్యాక్టరీని కాపాడుకునే విషయంలో జగన్ రెండు అంచెల స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు కేంద్రాన్ని రిక్వెస్టు చేసుకోవటం కాకుండా తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలని నిర్ణయించుకుందో జగన్ స్పష్టం చేయాలని జనాలు అనుకుంటున్నారు. సీఎం జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తున్నారని తెలియగానే.... జగన్ తన వాదనను గట్టిగా వినిపిస్తూ.. కేంద్రం నిర్ణయంపై తారా స్థాయిలో వ్యతిరేకత చూపుతారని అందరూ ఊహించారు. కానీ తీరా లేఖ చూశాక..కేంద్రాన్ని రిక్వెస్టు చేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఇలా ఏపీ సీఎం రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వినపడుతున్న సందర్భంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఎటువంటి పస లేని ఈ లేఖపై ఆశించిన సమాధానం రాదు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: