ఓటుకునోటు వ్య‌వ‌హారంలో ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. రేవంత్ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు మ‌రికొ్ంత మందికి నోటీసులు ఇవ్వాల‌ని టీ ప్ర‌భుత్వం ఏసీబీ అధికారుల‌కు తెలిపారు. దోషులు ఎంత‌టివారైనా వ‌ద‌ల‌కూడ‌ద‌ని ఏసీడీ అదికారులు ముందుకు పోతూ ప‌లు నాయ‌కుల‌ను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు.  మ‌రోవైపు నోటీసులు పంపిసై మేము కూడా పంపిస్తామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌వ‌ల్ చేశారు. ఎట్టిపరిస్థిత్తులో నోటీస్ లకు స్పందించ‌కూడ‌ద‌ని భీష్మీంచుకున్నారు చంద్ర‌బాబు. ఇలాంటీ ప‌రిస్టిత్తులో కూడా పక్కా ప్ర‌ణాళిక‌ల‌తో టీ ఏసీబీ ముందుకుపోతున్నారు. ఎట్టిప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుకు నోటీసులు పంపిస్తాం అవ‌స‌ర‌మైతే అరెస్ట్ కూడా వెనుకాడాబోమ‌ని తెల్చిచెప్పారు ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ముద్దాయిలు ఎంత‌టి వారైనా ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దలకూడ‌ద‌ని తెలంగాణ ఏసీబీ అడుగులు వేస్తోంది. ఈ కేసులో తదుపరి చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. టీ. ఏసీబీ నోటీసుల ప‌ర్వానికి శ్రీకారం చుట్టింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య, వేం. నరేంద‌ర్ రెడ్డి పై ధృష్టి  సారించింది. ముడుపుల కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఆదేశిస్తూ నోటీసు సిద్ధం చేశారు.  ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో ఏసీబీ అధికారులు నోటీసులు తీసుకుని సండ్ర నివాసానికి వెళ్లారు. 

మ్మెల్సీ అభ్య‌ర్ధి వేం న‌రేంద‌ర్ రెడ్డి


సండ్ర అందుబాటులో లేరిని తెలియ‌డంతో వెనుదిరిగారు.  ఇదే స‌మ‌యంలో రాత్రి 11:30 గంట‌ల‌కు వేం నరేంద‌ర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంట్ల‌నే ఉన్న వేం త‌నకు గుండె నొప్పి ఉంద‌ని, రేపు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు(బుధ‌వారం) ఏసీబీ విచార‌ణ కు హాజ‌రయ్యారు.ఈ ముడుపుల కేసుల్లో రెండో నిందితుడైన సెబాస్టియ‌న్ ఫోన్ నుంచి సండ్ర వెంక‌ట వీర‌య్య కు కాల్స్ వెళ్లిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మ‌రోవైపు ఈ వ్యవ‌హారంలో ల‌బ్ధి చేకూరే  ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి వేం న‌రేంద‌ర్ రెడ్డి. అయ‌న‌ను కూడా ప్ర‌శ్నించాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే ఇంటికి వెళ్లి వీరికి నోటీసులు ఇవ్వ‌కుండానే వెను దిరిగారు ఏసీబీ అధికారులు. ఈ కేసుతో సంబంధ‌మున్న వారంద‌రికీ నోటీసులు ఇచ్చి తీరుతామ‌ని ఏసీబీ వ‌ర్గాలు  చెబుతున్నాయి. ఈ నోటీసుల  ప‌ర్వం మొద‌లుకాక  ముందుకు ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. 


ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఒకే రోజు రెండు సార్లు తెలంగాణ సీఎం తో భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో సీఎం క్యాంపు కార్యాల‌యంలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత సాయంత్రం 6:15 గంట‌ల స‌మ‌యంలో మ‌రోసారి సీఎం తో స‌మావేశమ‌య్యారు. ఓటు నోటు వ్య‌వ‌హారం అత్యంత సునీతమైనది కావ‌డంతో ఏకే ఖాను ఈ కేసు ద‌ర్యాప్తు తీరును ఏకే ఖాన్ ఎప్ప‌టిక‌ప్పుడు గ‌వర్నర్ , తెలంగాణ సీఎం కు వివ‌రిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ కేసు విచార‌ణ‌లో భాగంగా కీల‌క‌మైన టీడీపీ నేత‌ల‌కు నోటీసులు జారీ చేసే అంశం పై ఖాన్ సీఎం కేసీఆర్ తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

ఏసీబీ డీజీ ఏకే ఖాన్ 


ఈ కేసు బ‌లంగా ఉండాల‌ని..నేరం రుజువైతే నింధితుల‌ను శిక్ష ప‌డేలా  ప‌క్కా గా ముందుకు వెళ్లాల‌ని సీఎం కేసీఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సూచించిన్న‌ట్లు తెలుస్తోంది. ఎట్టిప‌రిస్థిత్తుల్లో దొషుల‌ను వ‌ద‌ల‌కుడ‌దంటూ ఏకే ఖాన్ కు తెలిపిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి కూడా మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివ‌ధ‌ర్ రెడ్డి అమెరికా కు వెళ్ల‌డంతో ప్ర‌స్తుతం మ‌హేంద‌ర్ రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగం బాద్య‌త‌లు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ముద్దాయిగా అరోపిస్తున్న నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ‌కుండా  చూడాల‌ని తెలిపినట్లు స‌మాచారం. దొషులు ఎంత‌టి వారైనా వ‌ద‌ల‌వ‌ద్ద‌ని, అవ‌స‌ర‌మైతే అరెస్ట్ చేసైనా విచారించాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది 
మ‌రోవైపు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం నోటీసుల‌కు స్పందించ‌వద్ద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. తెలంగాణ ఏసీబీ చంద్ర‌బాబు కు  నోటీసులు ఇస్తే తాము కూడా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం పై కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యానికి వచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌త రెండురోజులుగా స‌చివాల‌యంలో  ఏపీ మంత్రులు, ఉన్న‌త స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశాలు ఏర్పాటు చేస్తూ తాజాగా ప‌రిస్థితుల‌పై, ఓటుకు నోటు కేసు నోటీసుల పై చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు. 

చంద్ర‌బాబుకు నోటీసులు పంపించాల‌ని తెలంగాణ ఏసీబీ 


ఈ కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు పంపించాల‌ని తెలంగాణ ఏసీబీ లు భావిస్తున్నారన్న వార్త‌లు మీడియా క‌థ‌నాలు రావ‌డంతో..నిజంగా అలాంటిదే జ‌రిగితే ఏం చేయాల‌న్నదానిపై ఈ స‌మావేశం లో చ‌ర్చ జ‌రిగిన్నట్లు తెలిసింది. తెలంగాణ ఏసీబీకి నోటీసులు పంపడానికి చ‌ట్ట‌ప‌రంగా అనుమ‌తి లేద‌ని, ఎపీ సీఎం కు సంబందించి తెలంగాణ కు అధికారాలు లేవ‌ని ఈ స‌మావేశంలో చర్చ‌కు వ‌చ్చింది. ఒక‌వేళ నోటీసులు పంపినా తీసుకొవ‌ద్ద‌ని నిర్ణ‌యించారు. తీసుకొక‌పోతే గొడ‌కు అంటింస్తారు. ఒక‌వేళ అలాంటిదే జ‌రిగితే మ‌నం కూడా తెలంగాణ సీఎం కు నోటీసులు పంపాల‌ని తీసుకొకుంటే మ‌నం కూడా గొడ‌కు అంటించాల‌ని భావిస్తున్నారు. వారు కోర్టు ద్వారా నోటీసులు  పంపితే మ‌నం కూడా కోర్టు ద్వారా పంపించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. రాజ్యాంగ సంక్షోభ మే జ‌రిగితే భ‌యప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని భావిస్తున్నారు. కోర్టు ద్వారా పంపిన నోటీసులకు స్పంధించ‌కుంటే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది. ఒక‌వేళ అరెస్ట్ చేస్తే  హైద‌రాబాద్ లో తెలుగు త‌మ్ముల‌తో ధ‌ర్నాలు , ఉధ్రిక్త  వాతావ‌ర‌ణాన్ని సృష్టించాల‌ని, దీని కోసం పార్టీ  లో కొంత‌మంది నాయ‌కులు స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.


మ‌రోవైపు తెలంగాణ సీఎం పై ఎలాంటి చ‌ర్య‌ల‌ను తీసుకొవాలో ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుక‌న్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమ్మ‌డి రాజ‌దాని హైద‌రాబాద్ పై సెక్ష‌న్ 8 విధింపు గురించి వాడివేడి చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఏపీ ప్ర‌భుత్వ ప‌లు అధికారుల‌, మంత్రుల ఫోన్ తెలంగాణ ప్ర‌భుత్వం  ట్యాప్ చేసిందని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇందుకుస్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉన్న‌ట్లు ఏపీ సీఎం బాబు చెప్పిన‌ట్లు తెలిసింది. ఫోన్ ట్యాప్ చాలా తీవ్ర‌మైన నేరం కాబ్బ‌టి సీఎం కేసీఆర్ పై ఈ కేసులో ముద్దాయిని చేయాల‌ని ఈ స‌మావేశంలో ప‌లువురు నాయ‌కులు అభిప్రాయ ప‌డ్డారు.మ‌రోవైపు 120 మంది ఏపీ ఆధికారుల ఫోన్ లు ట్యాప్ జ‌రిగాయ‌ని అందులో 35 ఫోన్ల ట్యాపింగ్ ల అధారాలను సేక‌రించామ‌ని పోలీసు అధికారులు తెలిపారు. మ‌రికొంత మంది వివ‌రాలు రావాల‌ని కేంద్రం రంగంలోకి దిగితే పూర్తి వివారాలు వెల్ల‌డ‌వుతాయ‌ని వారు పెర్కోన్నారు. తాజా ప‌రిస్థితుల పై చంద్ర‌బాబు  నేడు(బుధ‌వారం)  స‌చివాల‌యంలో  మంత్రుల‌, అధికారుల‌తో  స‌మావేశం కానున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: