ఇవాళ సాయంత్ర టీటీటీ పాలక మండలి సభ్యుల లిస్ట్‌ ను ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ లిస్ట్‌ లో ఏపీ తో సహా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళ నాడు కు చెందిన వారు ఉన్నారు.   అయితే.... ఇవాళ ప్రకటించిన టీటీడీ పదవిని తిరస్కరించారు అధికార వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు.  వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు...  మొదటి నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారని....కానీ టీటీడీ పదవి ఇచ్చి చేతులు దులుపు కోవడం తనని అవమానించడమే అని బాధపడుతున్నారని సమాచారం అందు తోంది. 

ఇక వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు వ్యవహారాన్ని....  అధికార వైసీపీ పార్టీ...  చాలా సీరియస్‌ తీసుకుంది.  ఇందులో భాగంగానే.. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ను బుజ్జ గించేందుకు  వైసీపీ నేత మరియు రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డిని రంగం లోకి దించారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే.. రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఫోన్ చేసి చెప్పినా...ఎమ్మెల్యే గొల్ల బాబురావు అస్సలు తగ్గడం లేదట. తనకు అసలు పదవులే అవసరం లేదు అని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతం లోకి వెళ్లిపోయారట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు.  

కాంగ్రెస్  పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు జగన్ వెంట నడిచిన అతికొద్ది మంది లో తాను ముందు వరుసలో ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సమాచారం.  అలాంటి తన కు దళితుడి ని కాబట్టే ఎన్నో అవమానాలు అంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆ రోజున ఏపీ సీఎం జగన్ మోహన్‌ ను బండ బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని మండి పడుతున్నారట.  ఆ రోజు అన్ని త్యాగం చేసి వెంట వచ్చిన మాకు అన్యాయమా అంటూ పార్టీ నాయకుల్ని నిలదీస్తున్నారట ఎమ్మెల్యే గొల్ల బాబూ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd