పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి....వైసీపీ ప్రభుత్వంలో అతి శక్తివంతమైన మంత్రి. అలాగే వైసీపీకి పెద్దిరెడ్డి పెద్ద దిక్కు. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందు నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన సొంత జిల్లా చిత్తూరుని పెద్దిరెడ్డి వైసీపీ వశం చేసేశారనే అసంతృప్తి చంద్రబాబుకు బాగా ఉంది. అసలు పేరుకు చిత్తూరు.. చంద్రబాబు సొంత జిల్లా గానీ..ఆధిక్యం మొత్తం వైసీపీదే. దానికి కారణం పెద్దిరెడ్డి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంపై పెద్దిరెడ్డికి పట్టు ఉంది. అందుకే గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 13 గెలిచింది. కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలిచారు.

ఇక ఇప్పుడు కుప్పం పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ హవా నడవటానికి కారణం పెద్దిరెడ్డి. అందుకే పెద్దిరెడ్డికి ముందు చెక్ పెట్టాలని బాబు బాగా ప్రయత్నిస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి లాంటి నాయకుడు మంత్రిగా ఉంటేనే వైసీపీకి అడ్వాంటేజ్. కానీ ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన బట్టి చూస్తే....100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధమైనప్పుడు....చిత్తూరులో పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసే నాయకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

చిత్తూరులో పెద్దిరెడ్డి, నారాయణస్వామిలు మంత్రులుగా ఉన్నారు. వీరు సైడ్ అయితే పదవి దక్కించుకోవాలని రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు కాచుకుని కూర్చుకున్నారు. అలాగే ఎస్సీ కోటాలో కూడా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసే సత్తా చిత్తూరులో మరొక నాయకుడుకు లేదనే చెప్పాలి. ఎందుకంటే రోజా, చెవిరెడ్డి, భూమన లాంటి నాయకులకు, వారి నియోజకవర్గాల్లోనే బలం ఉంది. జిల్లా మొత్తం బలం లేదు. పెద్దిరెడ్డికి ఆ బలం ఉంది. మరి చూడాలి పెద్దిరెడ్డి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: