ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమి...టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వరుసగా నాలుగుసార్లు గెలుస్తూ వచ్చిన ఉమాకు 2019 ఎన్నికల్లో తొలిసారి ఊహించని ఓటమి ఎదురైంది....అయితే గెలుపు ఉన్నంత కాలం కృష్ణా జిల్లాలో ఉమాదే పెత్తనం...కానీ ఓడిపోయాక ఆయన హవా తగ్గిపోయింది. దీంతో మైలవరం నియోజకవర్గానికే ఎక్కువ పరిమితమయ్యారు.

సరే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు...కానీ అధికార బలం ఉండటంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు తిరుగులేకుండా పోతుంది. ఆయనకు చెక్ పెట్టడం ఉమాకు ఈజీ కావడం లేదు. వసంతకు చెక్ పెట్టాలంటే స్థానిక ఎన్నికలు ఉమాకు మంచి ఛాన్స్. కానీ ఆ ఛాన్స్ ఉమా ఉపయోగించుకోలేదు. స్థానిక ఎన్నికల్లో పెద్దగా ఫైట్ ఇవ్వలేదు.

తేలికగానే ఎన్నికలని తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే మైలవరంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ హవానే కొనసాగింది...అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో అయితే దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఉమా కొంచెం సీరియస్‌గా తీసుకుని అభ్యర్ధులకు అండగా ఉంటే రిజల్ట్ వేరుగా ఉండేది. ఇక ఇప్పుడు జరుగుతున్న కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికని కూడా ఉమా పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. మున్సిపాలిటీలో 29 వార్డులకు టీడీపీ అభ్యర్ధుల చేత నామినేషన్స్ వేయించారు. అలాగే ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు.

కానీ అపోజిట్‌లో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌కు ధీటుగా మాత్రం ఉమా ముందుకెళ్లలేకపోతున్నారు. ఏదో మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు. ఎలా గెలవాలి, ప్రత్యర్ధులకు ఎలా చెక్ పెట్టాలనే వ్యూహాలని మాత్రం ఉమా వేస్తున్నట్లు కనిపించడం లేదు. అన్నిటికంటే ఉమా, టీడీపీ అభ్యర్ధులకు ఆర్ధికంగా అండగా ఉండటంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో వసంత దూకుడుగా ఉన్నారని తెలుస్తోంది. అంటే పంచాయితీ, ఎం‌పి‌టిసి ఎన్నికల మాదిరిగానే కొండపల్లి మున్సిపాలిటీని కూడా ఉమా వైసీపీకే అప్పజెప్పేలా ఉన్నారు. మళ్ళీ వసంతకు మంచి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: