కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటల్లో ముగియనుంది. మునిసిపాలిటిగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రచార పర్వం లో ప్రజలకు చేరువ కావడం అత్యంత కీలకమైన అంశం. ప్రజలకు దగ్గర కావాలి అంటే వారి సమస్యలు ఏమిటి, వారికి రోడ్లు కావాలా, డ్రైనేజీ కావాలా.. సంక్షేమం కావాలా తెలుసుకొని ఆ దిశగా హామీల జల్లు కురిపించాలి. ఇదే అంశంపై అధికార పార్టీ నేతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి, ఎంపిపి పాలడుగు జ్యోత్స్న, ఇతర నాయకులు కూడా మొత్తం రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రచారం నిర్వహించి ప్రజలకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం కోసం బలమైన కేడర్ మొత్తం రంగంలోకి దిగారు. విజయవాడ ఎంపి కేశినేని నాని,  మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రచార బాధ్యతలు చేపట్టారు. కానీ అత్యంత కీలకమైన నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాత్రం ఎప్పటిలాగానే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై ఆరోపణల పరంపర కొనసాగించారు. ఇదే ఆరోపణల పర్వం గత మూడేళ్లుగా చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కూడా మాజీ మంత్రి వర్యులు అదే పంద ఎంచుకోవడం అసలు విషయం పక్క దారి పట్టిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల సమయంలో తాము అధికారం లోకి వస్తే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, అభివృద్ధి చేస్తానని ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. కానీ ఇలాంటి ప్రధానమైన అంశం పక్కన పెట్టి ఎమ్మెల్యే వసంత ను టార్గెట్ చేసి విమర్శల పర్వం కొనసాగించారు. ఒక పక్క అధికార వైసీపీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం తో పాటు భవిష్యత్ లో చేయబోయే అభివృద్ధి పై ప్రజలకు పూర్తి క్లారిటీ ఇస్తున్నారు. కానీ టీడీపీ అధినాయకత్వం మాత్రం పాత కథనే చెబుతోంది. అదంతా ముగిసిన అధ్యాయం కావడంతో... ప్రజలు సైతం పెద్ద పట్టించుకోవటం లేదు. చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: