గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాలు తప్ప, మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. ప్రకాశం జిల్లాలోని కొండపిలో టీడీపీ గెలవగా, తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో జనసేన గెలిచింది. మిగిలిన అన్నీ నియోజకవర్గాలని వైసీపీ కైవసం చేసుకుంది.

అయితే ఈ రెండున్నర ఏళ్లలో చాలా నియోజకవర్గాల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీకి అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అందులోనూ కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

ఏదో జగన్ ఇమేజ్‌తో గెలిచేశారు గానీ, ఆ తర్వాత ఎఫెక్టివ్‌గా పనిచేయడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలోని పామర్రు, నందిగామ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వడ్. ఈ రెండు చోట్ల వైసీపీనే గెలిచింది. కానీ ఈ రెండున్నర ఏళ్లలో ఆ రెండు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్న మేర రాణించలేదని తెలుస్తోంది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే.. చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల్లో వైసీపీకి అంత అనుకూలమైన వాతావరణం లేదని తెలుస్తోంది.

అటు తూర్పులో అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. రాజోలులో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్...తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీలోకి వెళ్ళినా సరే ఈయన పనితీరు ఏమి బాగోలేదని తెలుస్తోంది. ఈయనపై చాలా నెగిటివ్ ఉందని టాక్. అయితే ఇలా మూడు జిల్లాలో ఉన్న కొన్ని ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ విఫలమైందని తెలుస్తోంది. టీడీపీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: