రాజకీయాల్లో కొందరు నేతల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. నేతలకు ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం వల్ల..ఆయా పార్టీలకు బాగా బెనిఫిట్ అవుతుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే కొందరు నాయకులు...తమ సత్తాతో పార్టీని గెలిపించేసుకుంటారు. అలా సత్తా ఉన్న నాయకులు కొంతమంది ఉంటారని చెప్పొచ్చు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఈయన ప్రభావం జిల్లాలో పలు సీట్లలో ఉంటుంది. ఆయన కెపాసిటీతో ఆ సీట్లలో వైసీపీ గెలవగలదు.

అలాగే శ్రీకాకుళంలో కింజరాపు ఫ్యామిలీ ప్రభావం వల్ల టీడీపీకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయనకు పట్టు ఉంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ  జిల్లాలో సత్తా చాటుతూ ఉంటుంది. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ విజయం కోసం గట్టిగా కృషి చేశారు.

కానీ 2014లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారు కావడంతో...బొత్స ఏమి చేయలేకపోయారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ కాస్త పట్టు దక్కించుకుంది. ఒకవేళ అప్పుడే బొత్స వైసీపీలో ఉండుంటే...జిల్లాలో వైసీపీకి లీడ్ వచ్చేది. ఇక 2019 ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడానికి బొత్సనే కారణమనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 9 సీట్లు వైసీపీ గెలుచుకోవడంలో బొత్స ఎఫెక్ట్ చాలా ఉంది.

అయితే ఇప్పటికీ జిల్లాలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉండటానికి బొత్సనే కారణం. ఇప్పటికే పలు జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ పికప్ అవుతుంది. కానీ విజయనగరంలో మాత్రం టీడీపీ ఇంకా పికప్ అవ్వలేకపోతుంది. అక్కడ ఇప్పటికీ వైసీపీనే లీడ్‌లో ఉంది. అలా వైసీపీలో లీడ్‌లో ఉండటానికి బొత్స ఇమేజ్ కారణమనే చెప్పాలి. నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ లీడింగ్ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి బొత్స ఎఫెక్ట్ వల్ల విజయనగరంలో ఫ్యాన్ హవా నడుస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: