ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకులు చాలామంది ఉన్నారు..పార్టీ కోసం బలమైన వాయిస్ వినిపించే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. అలా పార్టీ కోసం బలమైన గళం వినిపించే వారిలో..వంగలపూడి అనిత కూడా ఒకరు. టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనిత..అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా ఎదిగారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా టీడీపీ కంచుకోట అయిన పాయకరావుపేటలో సత్తా చాటారు...అయితే పాయకరావుపేట ఎమ్మెల్యేగా అనిత అనుకున్న మేర పని చేయలేకపోయారు.

అసలు ఆమెకు నెక్స్ట్ సీటు ఇవ్వడానికి వీల్లేదని నియోజకవర్గంలో ఇతర టీడీపీ నేతలు పెద్ద రచ్చ చేశారు. దీంతో చంద్రబాబు, ఆమెని కొవ్వూరు నియోజకవర్గంలో నిలబెట్టారు. ఇటు పేటలో బంగారయ్యని పోటీలో దింపారు. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో టీడీపీ కంచుకోటలు కుప్పకూలాయి.. రెండుచోట్ల టీడీపీ ఓడిపోయింది. అయితే వెంటనే చంద్రబాబు వ్యూహం మార్చి..మళ్ళీ పాయకరావుపేట బాధ్యతలు అనితకు అప్పగించేశారు.

ఈ రెండున్నర ఏళ్లలో అనిత చాలావరకు పుంజుకున్నారు...అయితే ఇక్కడ వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి బాగా ప్లస్ అవుతుంది...ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పనితీరుకు పెద్దగా మంచి మార్కులు పడటం లేదు. గతంలో టీడీపీలో ఉన్నట్లే ఇప్పుడు వైసీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి బాబూరావుది పశ్చిమ గోదావరి జిల్లా...దీంతో నాన్ లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. దీంతో స్థానికంగా ఉండే వైసీపీ నేతలు బాబురావుకు పెద్దగా సహకరించే పరిస్తితి లేదు.

పైగా ఇది టీడీపీ కంచుకోట...గ్రౌండ్ లెవెల్‌లో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దీంతో అనితకు అడ్వాంటేజ్ వచ్చింది. కాకపోతే మొదట నుంచి ఇక్కడ టీడీపీకి అండగా ఉన్న బీసీ, ఎస్సీ, కాపు వర్గాలు గత ఎన్నికల్లో వైసీపీ వైపుకు వెళ్ళాయి. వారిని మెజారిటీ స్థాయిలో తన వైపు తిప్పుకుంటే...నెక్స్ట్ ఎన్నికల్లో పాయకరావుపేటలో అనితకు తిరుగుండదనే చెప్పాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: