చలి పులి పంజా రోజు రోజుకు విస్తృతంగా విసురుతోంది. ముఖ్యంగా చలి గాలుల భయానికి బయటకు రావాలంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వ‌రైనా గ‌జ‌గ‌వణికిపోతున్నారు. కేవ‌లం ఒక్క ఢిల్లీలోనే కాదు.. ఉత్తరాధి నుంచి దక్షిణాధి వరకు ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రజలు చలికీ వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో కూడా మంచు క‌మ్మెస్తున్న‌ది.

 గ‌త సంవత్స‌ర కాలంలో అతిత‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయ‌ని పేర్కొంటున్నారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. ఢిల్లీలో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు 6 డిగ్రీల సెల్సీయ‌స్ క‌న్నా త‌క్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. ప‌గ‌టిపూట కూడా పొగ‌మంచు కురుస్తున్న‌ది. ముఖ్యంగా పంజాబ్‌, హ‌ర్యానా, పశ్చిమ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌ల‌లో కొన్ని ప్రాంతాలు.. ఉత్త‌ర రాజ‌స్థాన్‌లో రాబోయే 4 రోజులు తీవ్ర‌మైన చ‌లిగాలులు వీస్తున్నాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిస్తున్న‌ది.

ప్ర‌స్తుతం న‌మోదు అవుతున్న ఉష్ణోగ్ర‌తల కంటే 2 నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు తగ్గుతున్నాయ‌ని పేర్కొంది. ఫ‌తేపూర్, చురులో ఉష్ణోగ్ర‌త‌లు గ‌డ్డ‌క‌ట్టే స్థాయికి ప‌డిపోయాయి. ఆ ఎఫెక్ట్ దేశంలో ఉత్త‌ర ప్రాంతాల‌పై పడిన‌ది. రాజ‌స్థాన్‌లో చాలా ప్రాంతాల‌కు కోల్డ్ వేవ్ వార్నింగ్ కూడా ఇచ్చింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఉత్త‌ర‌ఖాండ్ కు ఆరేంజ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేసారు. రాత్రిపూట  ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కూడా రావ‌ద్దు అని సూచిస్తున్నారు.

జ‌మ్మూ-శ్రీ‌న‌గ‌ర్‌లో చాలా ప్రాంతాలు మంచులోనే చిక్కుకున్నాయి. ఇక్క‌డ ఉష్ణోగ్ర‌త సున్నా డిగ్రీల‌కు ప‌డిపోయిన‌ది. హ‌ర్యానా, పంజాబ్‌, రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల‌లో ప్ర‌జ‌ల‌ను అధికారులు అలెర్ట్ చేసారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీలో ఇండ్లు లేకుండా ఫుట్‌పాత్‌ల‌పై ప‌డుకునే వారిని.. అదేవిధంగా సేఫ్ హోంల‌కు త‌ర‌లించారు. చ‌లిగాలులు, మంచు కుర‌వ‌డంతో విమానం.. రైళ్ల ప్ర‌యాణాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్న‌ద‌ని పేర్కొంటున్నారు అధికారులు.

తెలుగు రాష్ట్రాల‌లో మ‌రింత చ‌లి తీవ్ర‌త పెర‌గ‌నున్న‌ది. రాత్రింబ‌వ‌ళ్లు.. చ‌లిమంట‌లు వేసుకోవ‌డ ద్వారానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని పేర్కొంటున్నారు. ఈశాన్యం నుంచి వీస్తున్న చ‌లి గాలుల‌తో మ‌రొక నాలుగు రోజుల‌లో రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత‌గా ప‌డిపోనున్నాయి. హైద‌రాబాద్‌లో క‌నిష్ట స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయ‌ని.. తెలంగాణ‌లో ప‌లు జిల్లాల‌లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం విశేషం.

ముఖ్యంగా  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్  జిల్లాల‌లో అత్యల్ప ఉష్ణోగ్ర‌త‌లు నమోదవుతూ ఉన్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసిన‌ది. ఏపీలో కూడా  ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా 5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త వ‌ర‌కు న‌మోదు అవుతుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: