అధికార వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సీఎం దగ్గర నుంచి చిన్న చిన్న పదవుల్లో కూడా రెడ్డి నేతలే ఎక్కువ ఉంటారు. అందుకే రాయలసీమ జిల్లాల్లోనే కాదు...తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కూడా రెడ్డి నేతలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఇక కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో కూడా నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు.

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నరసారావుపేట నుంచి reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డిలు గెలిచారు. అయితే ఈ నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ ఎమ్మెల్యేలే. అయితే ఇలా స్ట్రాంగ్‌గా ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.

ఇంతవరకు టీడీపీ అంతగా పికప్ అవ్వలేదు గానీ...ఇప్పుడుప్పుడే కాస్త గుంటూరు జిల్లాలో రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. ఈ క్రమంలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా రాజకీయ వాతావరణం మారుతుంది. రాను రాను రెడ్డి ఎమ్మెల్యేలకు టఫ్ ఫైట్ వచ్చేలా ఉంది. ఇప్పటికే అమరావతి ప్రభావం రెడ్డి ఎమ్మెల్యేలపై ఉంది.

ముఖ్యంగా మంగళగిరిలో ఆళ్ళపై...ఇక్కడ నారా లోకేష్ పుంజుకున్నారని చెప్పొచ్చు. అటు గురజాలలో కాసుకు ధీటుగా యరపతినేని శ్రీనివాసరావు పుంజుకుంటున్నారు. అయితే మాచర్లలో టీడీపీకి అంత ఛాన్స్ రాలేదు. కానీ తాజాగా కొత్త ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి వచ్చాక పరిస్తితి మారింది..పిన్నెల్లికి గట్టి పోటీ వచ్చేలా ఉంది. ఇటు నరసరావుపేటలో గోపిరెడ్డికి చదలవాడ అరవింద్ గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఇక్కడ కూడా రెడ్డి నాయకుడుని బరిలో దింపాలని టీడీపీ చూస్తుంది. మొత్తానికి ఈ సారి నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలకు టీడీపీ గట్టి ఫైట్ ఇచ్చేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: