నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటయ్య అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేయాలని. సర్వేపల్లిని కాదంటే మరి సోమిరెడ్డి ఏమి చేస్తారు ? ఏమి చేస్తారంటే నియోజకవర్గం మారాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. దీనిక ప్రధాన కారణం ఏమిటంటే వరుసగా నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లి నుండి పోటీచేస్తున్నా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.





నిజానికి సోమిరెడ్డి ఔట్ డేటెడ్ రాజకీయ నేతైపోయారనే చెప్పాలి. పార్టీ బలమే ఈయన బలంతప్ప ఈయనకంటు సొంతబలం లేదనేది వాస్తవం. పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే లేదంతే. 2014లో కూడా సోమిరెడ్డి ఓడిపోయారంటే ఈయన సత్తా ఏమిటో అర్ధమైపోతోంది. చివరకు ఎంఎల్సీ గా నియమితులై మంత్రయ్యారు. ఇలాంటి సోమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో కోవూరు లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఒకదానిలో పోటీచేయాలని అనుకుంటున్నారట. నియోజకవర్గం మారితే గెలుస్తారని ఎవరైనా చెప్పారేమో ?





నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డికి ఉన్న బంధుత్వం కలిసొస్తుందని అనుకుంటున్నారు. అలాగే పట్టణంలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో కూడా సోమిరెడ్డికి పట్టుందట. అందుకనే నెల్లూరు రూరల్ పై కన్నేశారు. ఇక కోవూరులో కూడా దగ్గర బంధుత్వాలున్నాయి. వైసీపీ ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దగ్గర బంధువు అవుతారు. అంటే బంధువుల్లో చీలిక తీసుకురావాలన్నది సోమిరెడ్డి ఆలోచనగా కనబడుతున్నది.





సోమిరెడ్డి ఆలోచన వరకు బాగానే ఉందికానీ కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోని నేతలు ఒప్పుకుంటారా ? వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఇప్పటికే పై నియోజకవర్గాల్లోని నేతల్లో కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయినా నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన సోమిరెడ్డి నియోజకవర్గం మారి పోటీచేస్తే భరించేందుకు పై నియోజకవర్గాల్లోని నేతలెవరు సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో చంద్రబాబునాయుడు నుండి నేతల్లో కొందరు హామీకూడా పొందున్నారు. కాబట్టి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: