తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు...టీడీపీలో కమ్మ వర్గం నేతల డామినేషన్ ఎక్కువగానే ఉంటుంది..రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కమ్మ నేతలదే పెత్తనం. అయితే ఈ పెత్తనం వల్ల టీడీపీకి ఒకోసారి లాభం జరగొచ్చు గాని...ఒకోసారి మాత్రం నష్టం జరిగేలా ఉంది..ఎందుకంటే ఎస్సీ స్థానాల్లో కూడా కమ్మ నేతల పెత్తనం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది.

అలా కమ్మ నేతల పెత్తనం వల్లే కంచుకోటగా ఉన్న కొవ్వూరులో టీడీపీ చాలా వరకు దెబ్బతింది. మొదట నుంచి కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..1983 నుంచి 2019 వరకు చూసుకుంటే కొవ్వూరులో టీడీపీ ఆరుసార్లు విజయం సాధించింది...మధ్యలో కాంగ్రెస్ ఒకసారి గెలవగా, ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది..తానేటి వనిత వైసీపీ నుంచి గెలిచి..ఇప్పుడు మంత్రి స్థానంలో కొనసాగుతున్నారు.

అయితే గత ఎన్నికల్లో కొవ్వూరులో టీడీపీ ఓటమికి కమ్మ నేతలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నారు...వీరు సీనియర్ నేత జవహర్‌ని తీవ్రంగా వ్యతిరేకించడంతో, చివరి నిమిషంలో వంగలపూడి అనితని కొవ్వూరులో పోటీ చేయించాల్సి వచ్చింది. దీంతో అనిత దారుణంగా ఓడిపోయారు. ఇక ఎన్నికలు అయిపోయాక అనిత మళ్ళీ...పాయకరావుపేటకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కానీ కొవ్వూరుకు మాత్రం ఇంకా ఇంచార్జ్‌ని పెట్టలేదు.

ఇక్కడ టీడీపీ కమ్మ నేతలు మాత్రం...ఇంచార్జ్ పదవి కమ్మ వర్గానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ స్థానంలో కమ్మ నేతని ఇంచార్జ్‌గా పెడితే పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయం. అయితే ఎన్నికల సమయంలో తాము చెప్పిన నేతకే సీటు ఇవ్వాలనే పట్టుదలతో కమ్మ నేతలు ఉన్నారు. జవహర్‌కు సీటు రాకుండా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక కమ్మ నేతలు అనుకున్నట్లు జరిగితే కొవ్వూరులో టీడీపీకి డ్యామేజ్ జరగడం ఖాయమని తెలుస్తోంది. జవహర్‌కు త్వరగా బాధ్యతలు అప్పగిస్తే...కొవ్వూరులో పార్టీ పరిస్తితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. చూడాలి మరి కొవ్వూరుని చివరికి ముంచుతారో తేలుస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: