ఒకోసారి నాయకులు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా బాగా బెనిఫిట్ అవ్వొచ్చు..అలాగే కొన్నిసార్లు బాగా నష్టం కూడా జరగొచ్చు. అయితే ఏ నాయకుడైన రాజకీయంగా బెనిఫిట్ అవుతుందనే చెప్పే పార్టీలు మారతారు. కానీ ఆ నిర్ణయాలే ఒకోసారి బెడిసికొడతాయి..అలా గత ఎన్నికల్లో చాలామంది నాయకుల నిర్ణయాలు బెడిసికొట్టాయి. ఎన్నికల ముందు టీడీపీ అధికారంలో ఉందని చెప్పి...చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు అధికారం కోసమని చెప్పి పార్టీలు మారిపోయారు..కానీ గత ఎన్నికల్లో ఆ నేతలు రాజకీయంగా చాలా నష్టపోయారు.

కొందరికి టీడీపీలో సీట్లు దక్కలేదు...అలా అని తర్వాత వైసీపీలోకి వెళ్ళినా సరే సీట్లు దక్కలేదు. ఇప్పటికీ ఆ నేతలకు సీట్లు దక్కేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎటు కాకుండా అయిపోయేలా ఉన్నారు..ఇక ఆ లిస్ట్‌లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు...2014లో ఈయన కర్నూలు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు...తర్వాత ఈయన టీడీపీలోకి వచ్చారు..కానీ 2019 ఎన్నికల్లో ఈయనకు టీడీపీలో సీటు దొరకలేదు..దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లారు.

వైసీపీలోకి వెళ్ళిన సీటు దక్కలేదు...ఇక ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు...అయితే ఈయనకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సీటు దక్కుతుందో లేదో తెలియడం లేదు. ఇక ఎస్వీ మోహన్ రెడ్డి బాటలోనే డేవిడ్ రాజు వచ్చారు...గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచారు...తర్వాత ఈయన టీడీపీలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ఈయనకు టీడీపీలో సీటు రాలేదు...దీంతో వైసీపీలోకి వెళ్లారు..అక్కడ ఛాన్స్ రాలేదు.

ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే ఆయనకు ఏ పదవి లేదు...దీంతో ఆయన మళ్ళీ టీడీపీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉంటే ఎలాగో సీటు దక్కేలా లేదు...అయితే సీటు ఇస్తే టీడీపీలో చేరడానికి డేవిడ్ సిద్ధంగా ఉన్నారు..కాకపోతే యర్రగొండపాలెం ఇంచార్జ్‌గా ఎరిక్షన్ బాబు ఉన్నారు. మరి ఆయనని కాదని డేవిడ్‌కు టీడీపీలో సీటు దక్కడం కష్టమే...మొత్తానికి మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా సరే రాజీ పడాల్సిందే అనుకుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: