వైసీపీ బలం రెడ్డి నాయకులే అని గట్టిగా చెప్పొచ్చు...వారే పార్టీకి ప్రాణవాయువు లాంటివారు. రెడ్డి నేతలు లేకపోతే వైసీపీ ఎప్పుడో వీక్ అయ్యేదని చెప్పొచ్చు..ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి రెడ్డి నేతలే కారణం. ఆ జిల్లాల్లో రెడ్డి వర్గం వల్లే పార్టీ బలంగా ఉంది...ఆ జిల్లాల్లోని నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ హవా నడిచిన నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు లాంటి జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం నడిచిన విషయం తెలిసిందే.

ఇక 2019 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది...వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారం దక్కించుకోవాలంటే రెడ్డి నేతలు చాలా ముఖ్యమని చెప్పొచ్చు. వారు స్ట్రాంగ్‌గా ఉంటే ..పార్టీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే రెడ్డి ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే..గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని రెడ్డి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు.

రెడ్డి ఎమ్మెల్యేల్లో చాలామంది మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ఉన్న కొందరు రెడ్డి ఎమ్మెల్యేల విజయాలకు బ్రేకులు వేయడం చాలా కష్టమనే చెప్పొచ్చు. అలా స్ట్రాంగ్‌గా ఉంటూ మళ్ళీ గెలవగలిగే సత్తా ఉన్న రెడ్డి ఎమ్మెల్యేల్లో..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కమలాపురం రవీంద్రా రెడ్డి, రాజంపేట మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఉన్నారు. అటు మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని, బుగ్గన, మేకపాటి సైతం మళ్ళీ గెలిచేలా ఉన్నారు. మొత్తానికి రెడ్డి వర్గం నేతలకు చెక్ పెట్టడం కష్టమే అని చెప్పొచ్చు.          

మరింత సమాచారం తెలుసుకోండి: