రెడ్డి సామాజికవర్గమే వైసీపీకి ప్రధాన బలం అని చెప్పొచ్చు...రాజకీయంగా రెడ్డి వర్గం బలంగా ఉంటే...వైసీపీ కూడా బలంగా ఉన్నట్లే లెక్క..రెడ్డి నేతలే వైసీపీని నిలబెట్టేది అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం దక్కడం వెనుక రెడ్డి నేతల కృషి ఉంది...అలాగే రాయలసీమ లాంటి ప్రాంతంలో వైసీపీలో స్ట్రాంగ్‌గా ఉండటానికి రెడ్డి నేతలే ప్రధాన కారణం...అలా వైసీపీ కోసం కష్టపడుతున్న రెడ్డి నేతలు...వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం లాంటి జిల్లాల్లో పార్టీ మంచి విజయాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కొందరు రెడ్డి నేతలు..తమ వారసులని సైతం పోటీకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయంగా పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు...మళ్ళీ పార్టీ సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇలా పనిచేస్తున్న రెడ్డి వారసులు వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడానికి ట్రై చేస్తున్నారు..ఈ క్రమంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు అభినయ్ రెడ్డి  నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల తిరుపతి పార్లమెంట్, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో అభినయ్ కీలక పాత్ర పోషించి...జగన్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక అభినయ్‌ని నెక్స్ట్ తిరుపతి అసెంబ్లీ బరిలో పెట్టాలని భూమన చూస్తున్నారని తెలుస్తోంది...దీనికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు.

అటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి సైతం దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తనయుడు శివ నరసింహారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డీ తనయుడు జయమనోజ్ రెడ్డిలు రాజకీయంగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. మరి వీరిలో నెక్స్ట్ ఏ వారసుడుకు సీటు దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: