ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే...వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది...ఇక టీడీపీ-జనసేన నుంచి వచ్చిన వారిని కలుపుకుంటే 156 మంది ఉన్నారు...ఇటు టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...ఇక మొత్తం మీద 175 మంది ఎమ్మెల్యేలు...ఈ 175 మంది ఎమ్మెల్యేల్లో..ఏ ఎమ్మెల్యే పనితీరు అద్భుతంగా ఉంది...ఏ ఎమ్మెల్యేకు ప్రజా మద్ధతు ఎక్కువగా ఉంది? ఏ ఎమ్మెల్యే ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు? అనే విషయాలని చూసుకుంటే..అసలు ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలు మాత్రం తక్కువే ఉన్నారని చెప్పొచ్చు.

ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉండాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది...వారే ప్రజల బాగోగులని చూసుకోవాలి..ప్రజలకు అండగా ఉండాలి..ప్రజలకు పనులు చేసి పెట్టాలి..నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి..కానీ ఈ పనులు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తున్నారు...ఏదో తక్కువ మంది మాత్రం కాస్త ప్రజలకు అండగా ఉండటంలో ముందున్నారని తెలుస్తోంది...ఇక మిగిలిన వారు అధికారం అనుభవించడం..అధికారం చెలాయించే పనిలోనే బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజల్లో ఉంటున్నారని తెలుస్తోంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల మధ్యలో ఉండటంలో ముందున్నారు..ఈయన రాజకీయం చేయడంలో కంటే...పాలకొల్లు ప్రజల మధ్యే ఎక్కువ కనిపిస్తారు.

ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలకు అండగా నిలబడటంలో నిమ్మల ఎప్పుడు ముందే ఉంటారు...అధికారం లేకపోవడం ఒక్కటే నిమ్మలకు కాస్త ఇబ్బంది అవుతుంది గాని...లేదంటే పాలకొల్లులో పూర్తి స్థాయిలో పనులు చేసేవారు..ఇప్పటికైనా సరే పనులు అవ్వకపోతే అధికారులు దిగి వచ్చేవరకు పోరాటాలు చేస్తూ ఉంటారు. ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తారు..అలాగే అధికారులు పనులు చేయించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగేసి పనులు చేసేస్తారు. అందుకే రాష్ట్రంలో ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్న ఎమ్మెల్యేల్లో నిమ్మల  రామానాయుడు టాప్‌లో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: