ఏపీ సీఎం జగన్ తన మంత్రులు గుండెల్లో గుబులు రేపారు.. సీఎంగా అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే  సీఎం జగన్ ఓ మాట చెప్పారు. రెండున్నరేళ్లు అయ్యాక మంత్రి వర్గం మొత్తం మార్చేస్తాను అని.. అప్పట్లోనే ఈ మాట సంచలనం కలిగింది. అందుకే మంత్రి పదవులు దక్కిన వారు ముందుగానే మెంటల్‌ గా ప్రిపేర్ అయ్యారు. కానీ.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. కానీ.. ఇప్పటి వరకూ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఇంత వరకూ అధికారికంగా జగన్ ఏమీ చెప్పలేదు.


దీంతో మంత్రుల్లో కాస్త భరోసా వచ్చింది. ఇప్పటి వరకూ ఏమీ చెప్పలేదంటే.. ఇదే మంత్రి వర్గం కొనసాగుతుందేమోనన్న ఆశలు మొలకెత్తాయి. రెండున్నరేళ్లు దాటినా జగన్ తమను మార్చకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. కానీ.. నిన్నటి మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ అనుకున్నట్టుగానే బాంబు పేల్చారు. ఏమయ్యా బుగ్గనా.. బడ్జెట్‌ చదివే రోజు కోటు వేసుకుని రావచ్చు కదా.. మళ్లీ నిన్న ఎప్పుడు మంత్రిగా చూస్తామో ఏమో అంటూ జగన్ పేల్చిన డైలాగ్ ఆయనతో పాటు మిగిలిన మంత్రుల్లోనూ ఒక్కసారిగా గుబులు రేపింది.


జగన్ వ్యాఖ్యలను మంత్రివర్గ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారట. దీనిపై స్పందించిన జగన్.. మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు.. మీకు ముందే చెప్పాను కదా.. అంటూ తన మనసులో మాటను మరోసారి స్పష్టం చేసేశారు. రెండున్నరేళ్ల తర్వాత  మారుస్తామని మొదట్లోనే చెప్పాను కదా.. ఇప్పుడు మీకు మంత్రులుగా  మూడేళ్ల అనుభవం వచ్చింది కదా.. ఇప్పుడు మీకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తారు అంటూ.. మీ పదవులు ఊడటం ఖాయం అని చెప్పకనే చెప్పేశారు జగన్.


మంత్రులను మారుస్తున్నామంటే.. అదేదో మిమ్మల్ని తక్కువ చేసినట్లు కాదు అంటూ జగన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. మీకున్న అనుభవంతో ఎన్నికల్లో పార్టీని నడిపించగలరని కాస్త వెన్న పూశారట. అయితే.. కొన్ని సామాజిక, రాజకీయ, ఇతర సమీకరణాలవల్ల కొందరు మంత్రులను మాత్రం కొనసాగించే అవకాశం ఉందని జగనే స్వయంగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: