జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరీ చేతకానిదైపోయిందా ? అని ఆశ్చర్యంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకరకాల మద్యం బ్రాండ్లు మార్కెట్లోకి రిలీజయ్యాయి. బ్రాండ్లు కొత్తవి కాబట్టి అంతకుముందు జనాలకు తెలిసే అవకాశంలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబునాయుడు అండ్ కో, ఎల్లోమీడియా ఓ రేంజిలో రెచ్చిపోయాయి. కొత్త బ్రాండ్లపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా ఓ పద్దతి ప్రకారం గబ్బుపట్టించాయి.





ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ విస్కీ, బూమ్ బూమ్ బీర్ లాంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని టీడీపీ+సోషల్ మీడియా+ఎల్లోమీడియా విపరీతంగా ట్రోలింగ్ చేసింది. దాదాపు మూడేళ్ళ తర్వాత హఠాత్తుగా ప్రభుత్వం+అధికారపార్టీ మేల్కొన్నాయి. కొత్త మధ్యం బ్రాండ్లకు ఎవరిహయాంలో అనుమతులొచ్చాయి, డిస్టల్లరీలు ఎవరివి అనే విషయాలను ఇపుడు బయటపెడుతున్నాయి. అధికారపార్టీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం ఇంతకాలం చంద్రబాబు, ఎల్లోమీడియా, పవన్ ఎగతాళి చేస్తున్న బ్రాండ్లన్నీ 2019కి ముందు అనుమతించినవే.





అంటే ఇపుడు ఎగతాళి చేస్తున్న బ్రాండ్లకు తన హయాంలో చంద్రబాబే అనుమతిలిచ్చారు. తానే అనుమతించి మళ్ళీ తానే ఇపుడు జగన్ ప్రభుత్వాన్ని గబ్బుపట్టిస్తున్నారు. అలాగే తాము ఎగతాళి చేస్తున్న బ్రాండ్లను చంద్రబాబే అనుమతించారని తెలిసీ ఎల్లోమీడియా జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతివ్వలేదని ఇపుడు అధికారపార్టీ మొత్తుకుంటున్నది. పైగా ఈ బ్రాండ్లను తయారుచేస్తున్నది టీడీపీ నేతల డిస్టిల్లరీల్లోనేట.





జనాలముందు ప్రభుత్వం బాగా గబ్బుపట్టిపోయిన తర్వాత ఇపుడు ప్రభుత్వం మేల్కొనటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం ప్రభుత్వం లేదా వైసీపీ నేతలు ఏమి చేస్తున్నట్లు ? టీడీపీ+ఎల్లోమీడియా బురదపూస్తుంటే ప్రభుత్వం పూయించుకుంటోందా ? మరీ ప్రభుత్వం ఇంత చేతకానిదైపోయిందా ? తన ముందు ప్రభుత్వంలో ఏమి జరిగిందో కూడా చూసుకోలేనంత అన్యాయంగా ఉందా జగన్ ప్రభుత్వం. ప్రతిపక్షం నుండి ప్రభుత్వంపై ఆరోపణలు రాగానే వాస్తవాలేంటో కూడా చెప్పుకోలేనంత ధీనస్ధితిలో ఉండి జగన్ ప్రభుత్వం. ఇంత అధ్వాన్న ప్రభుత్వానికి ఇంతమంది సలహాదారులు ఎంకున్నట్లో ?


మరింత సమాచారం తెలుసుకోండి: