జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల దెబ్బకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గిలగిల్లాడిపోతున్నారు. జగన్ అండ్ కో తనను చంద్రబాబునాయుడుకి దత్తపుత్రుడు అని పదే పదే అనటాన్ని తట్టుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ళని ఎలా అడ్డుకోవాలో తెలీక చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడుస్తున్నారు. నువ్వు నన్నంటే నేనూ నిన్నంటాను అంటు ఏడుపుమొహం పెట్టారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగిందిదే.





తనను దత్తపుత్రుడనద్దంటు బతిమాలుడుకున్నంతపని చేశారు. తనను దత్తపుత్రుడంటే తాను కూడా జగన్ను సీబీఐ దత్తపుత్రుడంటానంటు బెదిరించారు. ఈ మాటలు విన్నతర్వాత పవన్ కు దత్తపుత్రడని ఎవరిని అంటారో కూడా తెలీదన్న విషయం అర్ధమైపోయింది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు జగన్ అండ్ కో పవన్ను దత్తపుత్రుడని ఎందుకంటున్నారు ? ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కష్టపడుతున్నారు కాబట్టే.





ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ ఏనాడైనా చంద్రబాబు, నరేంద్రమోడినీ ప్రశ్నించారా ? ప్రతిపక్షంలో ఉన్నపుడూ  జగన్నే ప్రశ్నించారు, అధికారంలో ఉన్నపుడూ జగన్నే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హయాంలో కూడా రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాయికదా ? మరప్పుడెందుకని చంద్రబాబును పవన్ నిలదీయలేదు ? ఎందుకని అప్పట్లో టూర్లు చేయలేదు ? బహిరంగసభలు నిర్వహించలేదు ?





చంద్రబాబు హయాంలో జరిగిన వాటిపై నెరెత్తని పవన్ కు ఇఫుడు మాత్రమే ఆత్మహత్యలు, హత్యాచారాలు, దాడులు ఎందుకు గుర్తుకొస్తున్నాయి ? పవన్ పద్దతయిన వ్యక్తే అయితే అప్పట్లో చంద్రబాబును కూడా నిలదీసుండాలి. ఇపుడు జగన్ను తప్పుపడుతున్నట్లే  అప్పుడు చంద్రబాబును కూడా తప్పుపట్టుంటే పవన్ను పద్దతయిన వ్యక్తని అనుకునేవాళ్ళు. చంద్రబాబు హయామంతా బ్రహ్మాండమని, జగన్ పాలన మొత్తం అరాచకమని అంటున్నారు కాబట్టే పవన్ను జగన్ అండ్ కో చంద్రబాబు దత్తపుత్రుడంటున్నారు. దీనికే పవన్ గిలగిలాకొట్టేసుకుంటున్నారు. తనను దత్తపుత్రుడని అనకూడదంటే తాను ఏ విధంగా నడుచుకోవాలో ముందు పవన్ తెలుసుకోవాలి. ఇపుడు కూడా జగన్ అండ్ కో సెటైర్లు యటానికి తాను వాళ్ళకు అవకాశం ఇచ్చారన్న విషయాన్ని పవన్ మరచిపోతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: