వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షాలనుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలని అన్నారు అచ్చెన్నాయుడు. వాలంటీర్ వ్యవస్థ అంటే అస్సలు ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవారని, కానీ వైసీపీ హయాంలో వాలంటీర్లు డబ్బులు తీసుకుని ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వంపై కూడా టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి లేదని, ఇంకా చెప్పాలంటే ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ నాయకులకు నిద్రపట్టడంలేదని, అందుకే  పిచ్చివాగుడు వాగుతున్నారంటూ మండిపడ్డారు. దుర్మార్గులందర్నీ బంగాళాఖాతంలో‌ కలలని చంద్రబాబు అన్న మాటల్ని వక్రీకరించి ఆయన పొత్తుల గురించి మాట్లాడుతన్నారని ఆరోపించడం దారుణం అన్నారు అచ్చెన్నాయుడు. బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని చెప్పారు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందని, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బాబు పర్యటన విజయవంతం కావడం వల్లే జగన్ సహా వైసీపీ నేతలందరికీ తడిచిపోతోందని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.

చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారు, వారందరికీ వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ అధికారంలో ఉండగా కరెంటు సమస్య లేదని, ఇప్పుడు వైసీపీ వచ్చాక కరెంటు కష్టాలు ప్రజలకు తప్పడంలేదన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ నేతలు ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా.. వాలంటీర్ పోస్ట్ లను కూడా వారు ఉద్యోగాలుగా చెప్పుకోవడం విడ్డూరం అన్నారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని, అసలు వాలంటీర్ అంటే జీతం లేకుండా పనిచేయాలని, కానీ వీరంతా జీతం తీసుకుని వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వానికి హైగోర్టు చీవాట్లు పెట్టిందని అన్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా కాకుండా ఉద్యోగుల్లా పనిచేయాలని అన్నారు అచ్చెన్నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: