తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒక చాలెంజ్ విసిరారు. పార్టీ తరపున జరిగిన వర్క్ షాపులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు 175కి 175 సీట్లూ గెలవాలని మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. బహుశా దాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోందేమో. అందుకనే జగన్ను ఉద్దేశించి అచ్చెన్న ఒక చాలెంజ్ విసిరారు. అదేమిటంటే 175 సీట్లు వైసీపీ గెలుచుకుంటే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేసుకుంటారట.






అలాగే 175 సీట్లూ గెలుస్తామనే నమ్మకముంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని ఎన్నికలు వెళ్ళమని జగన్ కు చాలెంజ్ విసిరారు. అచ్చెన్న చాలెంజ్ లో ఎంతసేపు జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి, టీడీపీ అధికారంలోకి వచ్చేయాలన్న తపన తప్ప మరోటి కనబడటంలేదు. 175కి 175 సీట్లూ వైసీపీ గెలవాలని జగన్ అన్నారంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో ఫైటింగ్ స్పిరట్ మైన్ టైన్ చేయటానికే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలిచిపోతామనే అలసత్వం వద్దని అందరు కష్టపడాలనే అలా చెప్పారు.






175 సీట్లూ వైసీపీకి గెలుచుకోవటం కష్టమని అందరికీ తెలుసు. బహుశా మొదటినుండి చెబుతున్నట్లు కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించాలన్న కోరిక ఏమైనా తీరితే తీరవచ్చేమో తెలీదు. ఇంతోటిదానికి చాలెంజులు అవసరంలేదు. అచ్చెన్న చాలెంజే నిజమైతే వివిధ సమావేశాల్లో అచ్చెన్న మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు గ్యారెంటీ అని చెబుతున్నారు. మరీమాట నిజమేనా ? 160 సీట్లకన్నా తగ్గితే ఏం చేస్తారు ? పార్టీ ఆఫీసుకు తాళాలు వేసుకుంటారా ?






వైసీపీకి 175 సీట్లూ వస్తే టీడీపీ ఆఫీసుకు ఎలాగూ తాళాలు వేసుకోవాల్సిందే వేరేదారిలేదు. తాళాలు వేసుకోవాల్సింది అప్పుడు కాదు. టీడీపీకి 160 కన్నా తక్కువస్తే తాళాలు వేసుకుంటామని అచ్చెన్న చెబితే అర్ధముంది, ఆత్మవిశ్వాసం కనబడుతుంది. అంతేకానీ ఎంకరేజ్మెంట్ కోసం జగన్ చెప్పిన మాటలను పట్టుకుని అచ్చెన్న చాలెంజులు చేస్తున్నారంటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. ఎంతసేపు ప్రభుత్వాన్ని రద్దుచేసుకో, మధ్యంతర ఎన్నికలకు వెళదామనే యావే తప్ప పార్టీని పటిష్టం చేసుకునే ఆలోచనే లేదే.









మరింత సమాచారం తెలుసుకోండి: