మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీమంత్రిని గుడివాడలో పోటీచేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు సమాచారం. గుడివాడలో మాజీమంత్రి, వైసీపీ ఎంఎల్ఏ కొడాలినాని మొత్తం టీడీపీకి పెద్ద సమస్యగా తయారయ్యారు. కొడాలిని ఓడించటమే టార్గెట్ గా గడచిన రెండు ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు.






వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడించాలని టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళల్లో ముందు జగన్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి ఉన్నారు. జగన్, పెద్దిరెడ్డి వ్యవహారం ఎలాగున్నా కొడాలి మాత్రం 24 గంటలూ తనతో పాటు కొడుకు లోకేష్ ను టార్గెట్ చేస్తుండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఓడించాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. పట్టుదలైతే ఉందికాని అంతటి గట్టి నేతలు ఎవరున్నారు ? అన్నదే పెద్ద సమస్యగా తయారైంది.





నియోజకవర్గంలో కొడాలిని ఓడించేంత సీన్ ఎవరికీ లేదని అందరికీ తెలిసిందే. కొడాలి ఆర్ధికంగానే కాకుండా అంగబలంలో కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. కాబట్టి కొడాలిని ఓడించాలంటే టీడీపీ తరపున కూడా అలాంటి నేతే కావాలి. అందుకనే జిల్లాలోని నేతలతో మాట్లాడిన తర్వాత చివరకు దేవినేని ఉమ పేరు పరిశీలనకు వచ్చిందట. చాలామంది నేతలు చంద్రబాబుతో మాట్లాడుతు దేవినేని అయితేనే అన్నీరకాలుగా కొడాలికి ధీటైన అభ్యర్ధిగా తేల్చిచెప్పారట. దాంతో మాజీమంత్రితో చంద్రబాబు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో మైలవరంలో కాకుండా గుడివాడలో పోటీచేయమని చెప్పారట.





నిజానికి దేవినేనిది మైలవరం కూడా కాదు. అసలు ఆయన బేస్ నందగామ. పునర్విభజనలో నందిగామ ఎస్సీ రిజర్వుడు కావటంతో దేవినేని మైలవరంకు మారారు. రెండు ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో గుడివాడలో పోటీచేయమంటే దేవినేనికి కష్టమే. ఎందుకంటే గుడివాడలో దేవినేనికి మద్దతుదారులెవరు లేరు. పోనీ పార్టీ నేతలు సహకరిస్తారనుకుంటే అంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది. మరీపరిస్ధితుల్లో కొడాలి మీద పోటీచేయటమంటే దేవినేని సమస్యల్లో ఇరుక్కున్నట్లే. పార్టీలోని తన ప్రత్యర్ధివర్గమంతా కలిసి తనపై కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు దేవినేనిలో మొదలైందట. మరి ఈ సమస్యలో నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: