చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఈ విషయంలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అరాచకపాలన నడుస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపోయారు. మంగళవారం చంద్రబాబు, పవన్ జాయింట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతు ప్రభుత్వం ఏమిచేసినా మాట్లాడకూడదా ? అరాచకాలన్నింటినీ భరించాల్సిందేనా ? న్యాయంకోసం నోరెత్తితే కేసులు పెడతారా ? అంటు రెచ్చిపోయారు.





మీడియాను ఉద్దేశించి జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా రాసే స్వేచ్చ మీకుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయపార్టీలను, మీడియాను కూడా ఈ ప్రభుత్వం ఒత్తిడిలోకి నెట్టేస్తోందంటు మండిపోయారు. విశాఖపట్నంలో పవన్ కు మీటింగ్ పెట్టుకునే స్వేచ్చకూడా లేదా అంటు నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారని, పోస్టులుపెడితే కేసులతో వేధిస్తున్నారంటు చాలానేమాట్లాడారు. ఆస్తులు రాయించేసుకుంటున్నారు, దాడులు చేస్తున్నారంటు ఆరోపించారు.





ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అన్న వీళ్ళ ప్రశ్నకు సమాధానం ఉందనే చెప్పాలి. నిజంగానే ఏపీలో ప్రజాస్వామ్యం లేకపోతే చంద్రబాబుతో పాటు ఏ ప్రతిపక్షనేత కూడా నోటికొచ్చినట్లు మాట్లాడలేరు. అలాగే ఎల్లోమీడియా జగన్ వెంటపడి తమకు తోచింది రాసేస్తోంది. ఇద్దరు వ్యక్తులమధ్య జరుగుతున్న గొడవలను కూడా  ప్రభుత్వానికి అంటకట్టేస్తోంది.  ఇదంతా ప్రజాస్వామ్యం ఉందనటానికి నిదర్శనం కాదా ? నిజంగానే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రతిపక్షాల నేతలు తమిష్టంవచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయగలిగేవారేనా ? ఎల్లోమీడియా తమిష్టం వచ్చిన వార్తలు, కథనాలు రాయగలిగేవేనా ? చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం ఎలాగుండేది అన్న ప్రశ్నకు ముద్రగడపద్మనాభంను అడిగితే చెబుతారు.





ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని కాకుండా ఎల్లోమీడియా కేవలం నెగిటివ్ యాంగిల్ ను మాత్రమే పదేపదే హైలైట్ చేస్తోంది. చంద్రబాబు, పవన్ తమిష్ట ప్రకారమే టూర్లుచేస్తున్నారు, కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదే. సోషల్ మీడియాలో పోస్టులుపెట్టారని చంద్రబాబు హయాంలో కూడా ఎంతోమందిపై కేసులు పెట్టారు. టీడీపీ హయాంలో వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. వైసీపీ తరపున గెలచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి లాక్కున్న చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం ఉందా ? అని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: