ఏపీలో రాజకీయాలు రోజురోజుకు అసహ్యంగా మారిపోతున్నాయి. వార్తలు చదవాలన్నా, వార్తల కోసం టీవీలు చూడాలన్నా జనాల్లో ఏహ్యభావం పెరిగిపోతోంది. రాజకీయాలు కలుషితం అయిపోవటానికి కారణం మీరంటే కాదు కాదు మీరేనంటు మళ్ళీ ఇక్కడ కాట్లడుకుంటున్నాయి పార్టీలు. మొన్న 15వ తేదీన విశాఖపట్నంలో ప్రజాగర్జన తర్వాత మంత్రులు ఎయిర్ పోర్టుకు వెళ్ళినపుడు జనసైన కార్యకర్తలు చేసిన దాడి ఒక ఎత్తు. దానిపై దాడికి గురైన మంత్రులు పవన్ కల్యాణ్ పై రెచ్చిపోయారు.





ఆ తర్వాత వైజాగ్ నుండి మంగళగిరికి చేరుకున్న పవన్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ మీటింగులో మాట్లాడుతు వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన తిట్లపురాణం మరోఎత్తు. సినిమాలు ఒకదాన్ని మించి మరోటి  కలెక్షన్లలో రికార్డులు సృష్టించినట్లే నువ్వు ఎక్కువ తిట్టావా ? నేను ఎక్కువ తిట్టానా ? అన్నట్లుగా రెండువైపులా రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే తనను ప్యాకేజీస్టార్, దత్తపుత్రుడంటున్న వారిని చెప్పుతోకొడతానని పవన్ చెప్పుచూపించి వార్నింగ్ ఇవ్వటం ఏపీ రాజకీయాల బూతుల పురాణానికి హైలైట్.





ఒకపుడు రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఆరోపణలు, విమర్శలకే పరిమితమయ్యేవారు. అవికూడా హుందాగానే ఉండేవి. తర్వాత విధానపరంగా కాకుండా ఆరోపణలు, విమర్శలు వ్యక్తిగతమయ్యాయి. ఈ మధ్యకాలంలో అదికూడా దాటిపోయి తిట్లకు దిగేశారు. ఇపుడు తిట్లదశను కూడా దాటిపోయి కొట్టుకోవటం ఒకటే అన్నట్లుగా అయిపోయింది. అప్పుడుప్పుడు మంత్రుల, ప్రజాప్రతినిధుల కాన్వాయ్ పైన దాడులు కూడా మొదలైపోయాయి.






తొందరలోనే కాన్వాయ్ మీద కాకుండా వ్యక్తిగతంగానే మంత్రులపై దాడిచేసి కొడతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ప్రత్యర్ధులు అనే స్ధాయి దాటిపోయి శతృవులు అనేంతగా వైరుధ్యాలు పెరిగిపోవటమే. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా నేలమట్టం చేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు కాబట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఇపుడు జగన్ కు వచ్చింది. మధ్యలో అనవసరంగా పవన్  కల్యాణ్ దూరారు. ఇటు జగన్ బాగానే ఉన్నారు అటు చంద్రబాబూ బాగానే ఉన్నారు. మధ్యలో  దూరిన పవన్ కు ఇపుడు దెబ్బలు పడుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: