వైసీపీని బాగా రెచ్చగొట్టాలి..వాళ్ళని తమపై దాడులు చేసేట్లుగా ప్రేరేపించాలి..వాళ్ళు తమపై దాడులుచేసిన తర్వాత వీలైనంతగా  రచ్చచేసి సమాజంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ క్రియేట్ చేయాలి. తర్వాత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం బురదచల్లేసే పనిని ఎలాగూ ఎల్లోమీడియా చేసేస్తుంది. ఇదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం లాగుంది. ఎప్పుడు చేస్తారో తెలీని యాత్రకోసం వారాహి పేరుతో ఒక వాహనాన్ని రెడీచేయించుకున్నారు.





ఇపుడు సినిమా షూటింగుల గ్యాప్ లో పార్టీ సమావేశాలు, బహిరంగసభలు పెడుతున్నారు. వారాహి రెడీ అయ్యింది కాబట్టి అప్పుడప్పుడు యాత్రలు చేస్తారంతే. ఇంతోటిదానికి పవన్ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అయినా అధికారపార్టీకైనా ఏముంటుంది ? ఇపుడు చంద్రబాబునాయుడు ఇదేంఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమంలో తిరుగుతుంటే ఎవరైనా అడ్డుకుంటున్నారా ? రేపు పవన్ యాత్రను కూడా ఎవరూ అడ్డుకోరు.





అయితే సత్తెనపల్లి బహిరంగసభలో పవన్ మాట్లాడిన మాటలు మాత్రం తన యాత్రను వైసీపీ అడ్డుకోవాలని కోరుకుంటున్నట్లే ఉంది. అందుకనే చేతనైతే వారాహిని అడ్డుకోమని చాలెంజి విసిరారు. పవన్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తాను వారాహిలో యాత్ర చేస్తానని చేతనేతే ముఖ్యమంత్రి లేదా ‘కూసేగాడిదలు’ అడ్డుకోవాలని రెచ్చగొట్టేట్లుగా చాలెంజి చేయాల్సిన అవసరం ఏమిటి ? కూసేగాడిదలు అని పవన్ అన్నారంటేనే అందులో వ్యూహం అర్ధమైపోతోంది. కూసేగాడిదలు అన్న తర్వాత వారాహి యాత్రను వైసీపీ వాళ్ళు అడ్డకుంటారు కదా. అప్పుడు వైసీపీ-జనసేన శ్రేణుల మధ్య గొడలు జరుగుతాయి. అలా గొడవలు జరగాలనే పవన్ కోరుకుంటున్నట్లున్నారు.





గొడవలు చేయించి సింపతి పెంచుకుని జనాల మద్దతు ఎట్ లీస్ట్ కాపుల మద్దతు కూడగట్టుకోవాలన్నది పవన్ ప్లాన్ చేసినట్లుంది. మరి పవన్ ట్రాపులో వైసీపీ నేతలు పడి అల్లర్లకు అవకాశం ఇస్తారా ? లేకపోతే పవన్ మానన పవన్ను వదిలేసి వారాహి యాత్రను సజావుగా జరగనిస్తారా అనేది చూడాలి. నిజానికి వారాహి యాత్రచేసేంత సీన్ పవన్ కు లేదు.  ఎందుకంటే సినిమా షూటింగుల్లోనే బిజీగా ఉండే పవన్ ఇప్పుడిప్పుడే యాత్ర చేసే అవకాశమే లేదు.


 





మరింత సమాచారం తెలుసుకోండి: