క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. వచ్చేఎన్నికల్లోగా కాపులను జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనే ప్లాన్ జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య దీక్షకు కూర్చోవటం, పవన్ కల్యాణ్ చెప్పగానే విరమించటం రెండూ అయిపోయాయి. కాపులకు 5 శాతం రిజర్వేషన్ వర్తింపచేయకపోతే జనవరి 2వ తేదీనుండి నిరవదిక దీక్ష చేయబోతున్నట్లు జోగయ్య గతంలోనే జగన్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.





జోగయ్య అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా జగన్ అయితే లెక్కచేసినట్లు లేరు. అందుకనే సోమవారం నుండి జోగయ్య దీక్షకు రెడీ అయ్యారు. అయితే ఉదయమే పోలీసులు జోక్యం చేసుకుని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పాయింట్ అంతా కాపులకు రిజర్వేషన్ అమలుచేయటానికి జగన్ వ్యతిరేకం అనే ముద్రవేయటమే. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తు నరేంద్రమోడీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది.






అయితే  ఆ 10 శాతం రిజర్వేషన్లలోనే కాపులకు చంద్రబాబునాయుడు 5 శాతం రిజర్వేషన్ కేటాయించారు. రిజర్వేషన్ అయితే కేటాయించారు కానీ అమల్లోకి మాత్రం తేలేకపోయారు. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కాపులకు రిజర్వేషన్ అంశాన్ని పట్టించుకోలేదు. మరిపుడు ఎన్నికల వేడి పెరిగిపోతున్న నేపధ్యంలో మళ్ళీ కాపులకు రిజర్వేషన్ అన్న అంశాన్ని వాడుకుని జగన్ను కార్నర్ చేయాలని ప్లాన్ చేశారు. అదికూడా తనకు అత్యంత సన్నిహితంగా ఉండే జోగయ్యను పావుగా వాడుకున్నారు.






ఈ ప్లాన్ వెనుక  జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు ఉన్నట్లు వైసీపీలోని పేర్నినాని లాంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కాపులను వైసీపీ నుండి దూరంచేసి తర్వాత వాళ్ళ మద్దతును ఏకమొత్తంగా టీడీపీ+జనసేన లబ్దిపొందాలన్నదే వీళ్ళిద్దరి ఆలోచనగా  వైసీపీ కాపునేతలు అనుమానిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో జగన్ను ఇరుకునపెట్టి లబ్దిపొందాలని చంద్రబాబు, పవన్ వ్యూహాలు రచించటంలో తప్పేమీలేదు. కాకపోతే వీళ్ళిద్దరి వ్యూహాంలో చిక్కుకోకుండా తప్పించుకుని ఎదురు వీళ్ళిద్దరిని ఇరుకునపెట్టడంలోనే జగన్ చతురత బయటపడుతుంది.  మరి చివరకు ఈ విషయాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: