రాజకీయాలలో పార్టీ ఏదైనా కొందరి నాయకులకు మరికొందరి నాయకులతో బేధాలు ఉంటాయి. అయితే ఈ తేడాలు అన్నీ కూడా వ్యక్తిగతమైన స్వార్ధాల కోసమే అని తెలిసిందే. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి ఇద్దరు నాయకులు ఉండడం, క్యాబినెట్ హోదా కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఒకే జిల్లాలో ఉండడం, లేదా ఒకరు న్యాయంగా పనిచేస్తూ మరొకరు అన్యాయంగా చేస్తున్నపుడు ఇలా సందర్భం ఏదైనా సొంత పార్టీ నాయకులమధ్యన వివాదాలు వస్తుండడం సాధారణమే. కానీ ఇవన్నీ హై కమాండ్ చూసుకుంటూ వాటిని సర్దిపెట్టుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి.

అయితే అలాంటి హై కమాండ్ తోనే సమస్య అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ? సరిగ్గా ఏపీలో అలాంటిదే జరిగింది. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరిన ఆనంకు వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును కేటాయించాడు... ఎన్నికల్లో ఫ్య గాలితో గెలిచిన 151 నియోజకవర్గాలలో వెంకటగిరి కూడా ఒకటి. అంత బాగుంది మంత్రివర్గం సమయంలో ఆనం మంత్రి పదవిని ఆశించారు. కానీ జగన్ ఇవ్వలేదు.. స్పీకర్ పదవిని కూడా ఇవ్వడానికి ఇష్టం చూపలేదు.

ఆ తర్వాత మళ్ళీ రెండవసారి మంత్రి వర్గ విస్తరణలో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీనితో లోపల ఇగో పెట్టుకున్న ఆనం సొంత పార్టీపైనే మీడియా ముందు కావొచ్చు , సభలలో కావొచ్చు వ్యతిరేకంగా కామెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ వైసీపీ అధినేత మరియు ఏపీ సీఎం జగన్ ఈ విషయాన్ని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆనం రామనారాయణరెడ్డి తరచూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడంతో తాజాగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించాడు. దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆనంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీని వ్యతిరేకపరిచే వ్యాఖ్యలు చేయడం ఎవ్వరికీ తగదని... అలంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపాడు. ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ... ఎంత పెద్ద నాయకుడు అయినా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలని ఘాటుగా చెప్పారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: