ఇలాంటి పిచ్చిరాతలు రాయటం ఎల్లోమీడియాకు మాత్రమే చెల్లింది. పవన్ కు కేసీయార్ వల అని పెద్ద హెడ్డింగ్ తో బ్యానర్ కథనం ఇంట్రో అచ్చేశారు. అందులో ‘వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయినా పర్వాలేదు నేను సమకూరుస్తాను, మీరు నాతో చేతులు కలపండి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేసీయార్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. అంటే పవన్ కు కేసీయార్ బంపరాఫర్ ఇచ్చింది వాస్తవమే అన్నట్లుగా రాసేశారు. మళ్ళీ రెండో లైనులోనే ‘ఈ ఆఫర్ తో పవన్ దగ్గరకు కేసీయార్ దూతలను పంపినట్లు తెలిసింది’ అని రాశారు. అంటే పవన్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే అని ఎల్లోమీడియా ముద్రేసినట్లయ్యింది.

మొదటి లైనులో వెయ్యి కోట్ల రూపాయల ఖర్చ పెట్టడానికి కేసీయార్  రెడీగా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసేసి రెండోలైనులో మాత్రం దూతలను పంపినట్లు తెలిసిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా ఏపీలో కాపులంతా పవన్ తోనే ఉన్నట్లు కేసీయార్ అనుకుంటున్నారని ఎల్లోమీడియా సర్టిఫై చేసేసింది. ఇంతకీ పవన్ తో చేతులు కలపటానికి కేసీయార్ ఎందుకు ప్లాన్ చేశారంటే చంద్రబాబును ఓడించటానికట. చంద్రబాబును ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించటమే కేసీయార్ ఉద్దేశ్యంగా ఎల్లోమీడియా చెప్పింది.

పార్టీ బలమెంత ? ఏ నేతకు జనాల్లో ఉన్న ఆదరణ ఎంతని తెలుసుకోలేనంత అమాయకుడా కేసీయార్. ఏపీలో కాపులంతా పవన్ వెంట ఉన్నది నిజమే అయితే పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఎందుకు ఓడిపోతారు ? దాంతోనే జనాల్లో పవన్ కున్న ఆధరణ ఎంతో అందరికీ తెలిసిపోయింది. పైగా తన అభిమానులందరు తనకు ఓట్లేయరని స్వయంగా పవనే చెప్పుకున్నారు కదా.

పవన్ను గనుక లాక్కుంటే తెలంగాణాలో కాపులంతా బీఆర్ఎస్ కు ఓట్లేస్తారని కేసీయార్ అనుకుంటున్నారట. ఏపీలోనే పవన్ కు కాపుల ఓట్లు పడటంలేదు. ఇక తెలంగాణాలో పడతాయా ? చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేయటం ఖాయమని తెలిసిపోతోందట. ఒక్క ఎల్లోమీడియాకు తప్ప చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఎవరిలోను నమ్మకంలేదు.  పవన్ సింగిల్ పాయింట్ అజెండానే జగన్ను ఓడించటమైనపుడు మళ్ళీ కేసీయార్ తో చేతులు కలిపి వైసీపీ గెలుపుకు ఎందుకు సహకరిస్తారు ? ఏమిటో ఇలాంటి పిచ్చిరాతలు రాయటం ఎల్లోమీడియాకు మాత్రమే చేతనవుతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: