రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తెచ్చుకోవాలంటే మామూలు విషయం కాదు. గడచిన నాలుగేళ్ళుగా వివిధ వేదికలపై జగన్మోహన్ రెడ్డి అనేక మాటలుచెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు ఎలాగ పనిచేయాలనే విషయాన్ని  జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. సో, పార్టీవర్గాల సమాచారం ప్రకారం వైసీపీలో టికెట్ సాధించాలంటే ఒక నేత చాలా పరీక్షలు పాసవ్వాల్సుంటుందనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే జగన్ టార్గెట్ అంతా వైనాట్ 175 ? చుట్టూనే తిరుగుతోంది కాబట్టి.





పార్టీవర్గాల సమాచారం ప్రకారం కనీసం 40-45 మంది ఎంఎల్ఏలకి జగన్ టికెట్లు ఇవ్వటంలేదట. ఇపుడున్న 151లో నలుగురు ఎంఎల్ఏలపై  పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. అంటే నెల్లూరు రూరల్, వెంకటగిరి, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులు ఖాయం. ఇందులో నెల్లూరు రూరల్లో ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్లు ఖాయమైనట్లే.  పులివెందులను  తీసేస్తే మిగిలిన 148 నియోజకవర్గాల్లో సుమారు 40 చోట్ల కొత్త అభ్యర్ధులు పోటీచేస్తారని చెప్పుకుంటున్నారు. మరో 23 చోట్ల ఎవరికి టికెట్లిస్తారో తెలీదు.





సరే ఇక నేతలు రాయాల్సిన పరీక్షల విషయాన్ని చూద్దాం. ముందుగా అర్ధ, అంగ బలాల్లో గట్టివాళ్ళయ్యుండాలి. అలాగే టికెట్ ఆశిస్తున్న నేతలు తమ సామాజికవర్గాల్లో తమకున్న పలుకుబడిని నిరూపించుకోవాలి. ప్రజల్లో తమకున్న గ్రాఫ్ తో జగన్ను మెప్పించగలగాలి. ఈ విషయాలన్నీ కాకుండా జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ రిజల్టు ఉండాలి. ఈ రిజల్టు ఐప్యాక్ సర్వే బృందాల నివేదికలతో మ్యాచ్ అవ్వాలి.





ఇన్ని పరీక్షల్లో పాసైతే అప్పుడు సదరు నేతకు టికెట్ ఇచ్చే విషయాన్ని జగన్ ఆలోచిస్తారు. అంటే టికెట్లు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయిన నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధుల ఎంపికకు ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్ధమవుతోంది.  జగన్ ఎన్నిజాగ్రత్తలు తీసుకుని టికెట్ ఇచ్చినా ఆ అభ్యర్ధి కచ్చితంగా గెలుస్తారనే గ్యారెంటీ ఏమీలేదు. అందుకనే గాలికి కొట్టుకుని పోయేవాళ్ళకి కాకుండా  టికెట్ ఇచ్చేటపుడే గట్టి వాళ్ళని పోటీకి దింపాలన్నది జగన్ ఆలోచన. మరి జగన్ పరీక్షను ఎంతమంది తట్టుకుని నిలుస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: