ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్, తెలంగాణ సీఎం చంద్ర శేఖర్ రావును ఇటీవల హైదరాబాద్ లో కలిశారు. వీరు కలవడానికి ప్రధాన కారణం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పాలని  మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మరో కారణం వీరు కాంగ్రెస్ కూటమిలో లేరు అని చెప్పడానికి సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.


అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి.ఇప్పటి వరకు మేయర్ ఎన్నిక ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఐఏఎస్, ఐపీఎస్ లను నియమించే అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీనిపై ఒక రాష్ట్రం మీద కేంద్రం పెత్తనం చెలాయించాలనుకుంటోందని  సీఎం కేజ్రీవాల్ మండిపడుతున్నారు.


కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి ఆర్డినెన్స్ తేవడంపై తీవ్రంగా విమర్శించారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న విషయం ఏమిటంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని ఇక్కడ ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలు, రాయబారులు ఉంటారు. ఇంటిలిజెన్స్ విభాగం, ఐఏఎస్ ల నియామకం ఎప్పటికీ కేంద్రం ఆధీనంలోనే ఉంటేనే శాంతి భద్రతల సమస్యలు రావు అని చెబుతోంది. రాష్ట్ర పాలన వ్యవహారాల్లో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం మరీ ఎక్కువగా ఉంటోందని అలాంటపుడు ఎన్నికలు జరపడం ఎందుకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎందుకని ఆప్ సర్కారు వాదిస్తోంది.


దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశంలో ఎమర్జెన్సీ నడుస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం సెక్రటెరియట్ ప్రారంభానికి గవర్నర్ ను పిలవలేదు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ను ఎత్తి వేసి నిరసన తెలిపే హక్కును తెలంగాణ ప్రజలకు లేకుండా చేశారు. ఇవేవీ ఆయనకు కనిపించడం లేదా.. ఢిల్లీలో జరుగుతున్న విషయమే ప్రధానమా అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR