టీడీపీని ఖాళీ చేసి అర్జెంట్ గా రెండో స్థానానికి చేరాలని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగా బీజేపీ కార్యాచరణ సాగుతోంది. అలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో టీడీపీ పక్కకు తప్పుకోవడం ద్వారా నేరుగా బీజేపీకి ఆ స్థానం దక్కినట్టే అవుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ కి పోటీగా బాబు స్థానంలో బీజేపీని జనం గుర్తించే స్థానానికి చేరినట్టే అవుతుందని లెక్కలేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ నేతల ఆశీస్సులు అత్యవసరంగా భావిస్తున్న చంద్రబాబు ఆత్మహత్యాసదృశ్యమైన నిర్ణయాలతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందనడంలో సందేహం లేదు.