మొన్నామధ్య బొత్స సత్యనారాయణ ఏపీ రాజధానిగా అమరావతి పనికిరాదని త్వరలోనే దానిని జగన్ ప్రభుత్వం తరలించే అవకాశాలు ఉన్నాయని చేసిన సంచలన వ్యాఖ్యలు చాలా రోజుల పాటు రాష్ట్రంలో కొత్త చర్చలకు తెరలేపాయి. మళ్లీ ఇప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత పెద్ద దుమారాన్ని రేపాయి. పది రోజుల్లో ఒక కమిటీ రాష్ట్రం అంతా తిరిగి ప్రజాభిప్రాయ సేకరణను చేపడుతుందని దానిని బట్టే వారు రాజధానిపై కొద్ది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు బయటికి వస్తున్న మాట ఏమిటంటే జగన్ రాజధానిని రాయలసీమకు మార్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయట.

మొన్న అనంతపురం కడప మరియు కర్నూలు నుండి చాలా మంది న్యాయవాదులు ఏపీ సెక్రటేరియట్ కు తరలి వెళ్లారు. ఎలాగో రాజధాని అమరావతిలో ఉంది కాబట్టి తమ ప్రాంతంలో లో ఏర్పాటు చేయాలని వారి వాదన. రాజకీయ నాయకులు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను మర్చిపోతారు అని వారు సీఎం కాన్వాయ్ వెళుతుండగా నొక్కి వక్కాణించారు. అలా జరగకపోతే హైదరాబాదుకి పట్టిన గతే అమరావతి కూడా పడుతుందని... తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అడగలేకపోయామని అని... అయితే జగన్ మోహన్ రెడ్డి ఏదో ఒక విషయమై మాకు హామీ ఇస్తే గాని కదిలేది లేదని వారు అన్నారు.

వారి మరింత ముందుకు వెళ్లి ఏర్పాటు చేస్తే హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేయండి లేకపోతే రాజధానినే సీమ ప్రాంతంలో సరైన చోట చూసి తరించాల్సిందే వారు కోరారు. వీరి వాదనతో ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రేణుల్లో కొత్త ఆలోచనలు మెదులుతున్నాయట. ఎలాంటి గొడవలు లేకుండా రాజధానిని ఏకంగా రాయలసీమకి తరలిస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటున్నారట. అందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ మన ఏపీ రాష్ట్ర రాజధాని భవితవ్యంపై ఒక నిర్ణయానికి ప్రభు త్వం రావడానికి ఎంత సమయం లేదు అన్నది మాత్రం స్పష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: