ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే వచ్చే నెల అయిన నవంబర్ లో జగన్ మరిన్ని కొత్త పథకాలు ప్రారంభించబోతున్నారు.


అవేమిటో చూద్దాం.. నవంబర్‌ 2 నుంచి వైయస్‌ఆర్‌ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం కానుంది. తొలి విడతలో 69.03 లక్షల మంది పిల్లల్లో 65.03 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు . ఇందులో 4.3 లక్షల మంది పిల్లలు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్‌ ప్రాంగణాల్లోనే రెండో విడత కంటి వెలుగు ప్రారంభం కానుంది. పిల్లలకు స్క్రీనింగ్‌ చేసి కంటి అద్దాలు అందజేయనున్నారు.


ఇక నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ అమలు. ఇప్పటి వరకు దాదాపు 130 ఆస్పత్రులు ఎంప్యానల్‌ అయ్యాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 500 రకాల మందులు లభిస్తాయి. నవంబర్‌ 20 నుంచి ప్రభుత్వాస్పత్రులకు మందుల పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కలెక్టర్లు తనిఖీ చేయనున్నారు.


ఆ తర్వాత నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు. రూ. 10 వేల లోపు డిపాజిట్‌దారులకు రూ.264 కోట్లు విడుదల. మొత్తం 3 లక్షలకుపైగా బాధితులకు చెల్లింపులు చేస్తారు. నవంబర్‌ 14 నుంచి పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం. తొలి విడతలో 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు. వచ్చే ఏడాది మార్చి 30 నాటికి అభివృద్ధి పనులు పూర్తి అవుతాయి.


వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం.. ఆ తరువాత ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తారు. నవంబర్‌ 21న మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబానికి రూ.10 వేల సాయం అందించనున్నారు. లీటర్‌ డీజిల్‌పై రూ.6.03 ఉన్న సబ్సిడీ రూ.9లకు పెంచారు. ముమ్మిడివరంలో జరిగే కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: