జ‌న‌సేన పార్టీకి గుడ్ బై చెప్పేసిన సీనియ‌ర్ నేత వైసీపీలో చేరారు. ఏపీలో ఏప్రిల్ 11 న ఎన్నికలు జరిగినప్పటికీ ఫలితాలు మే 23న వెలువడనుండ‌గా..మూడ్రోజుల ముందే జనసేన పార్టీకి అద్దేపల్లి శ్రీధర్ రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ముఖ్య‌నేత‌ సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా క‌ప్పుకొన్నారు. 


గతంలో బీజేపీ పార్టీలో ఉన్న అద్దేప‌ల్లి శ్రీధర్ ఎన్నిక‌ల‌కు దాదాపు సంవత్సరం ముందు జనసేనలోకి వచ్చారు. ఆయ‌న జ‌న‌సేన ఎంట్రీ స‌మ‌యంలో హాట్ టాపిక్‌గా మారారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడంతో బీజేపీకి గుడ్ బై చెప్పినట్లు అద్దేపల్లి శ్రీధర్ పేర్కొన‌గా...ఆయ‌న పార్టీ మారిన వెంట‌నే జనసేన స్పోక్స్ పర్సన్‌‌ పదవి వరించింది. అయితే, ఈ విషయంపై `ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రిటిక్‌` కత్తి మహేశ్ ఘాటుగా స్పందించారు. “అంటే అన్నాం అంటారు గానీ! కొత్తగా ఎవరూ లేనట్టు మాజీ బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ను జనసేన స్పోక్స్ పర్సన్ చెయ్యడమేమిటి! ఇన్నాళ్లూ గొంతెత్తి జనసేన గళం వినిపిస్తున్న యువనాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటివాళ్లకు అన్యాయం కదా!?!” అని కత్తి ట్వీట్ చేశారు. అయితే, దీనిపై జ‌న‌సేన స్పందించ‌లేదు. పార్టీ ప్రతినిధిగా పలు చర్చ వేదికల్లో శ్రీ‌ధ‌ర్‌ బ‌లంగా గ‌లం వినిపించారు. అయితే, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోలింగ్ జ‌రిగిన అనంత‌రం ఫలితాలు వచ్చే ముందే...శ్రీధర్ పార్టీ నిష్క్రమించ‌చారు.


ఆయ‌న  చర్చనీయాంశంగా మారింది. జనసేన జాతకం ముందే తెలిసి పార్టీని వీడుతున్నారని ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ...జ‌న‌సేన ఘోర ప‌రాజ‌యం పాలైంది. కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీ త‌ర‌ఫున గెలుపొందారు. పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. కాగా ప్ర‌స్తుతం వైసీపీలో చేరిన శ్రీ‌ధ‌ర్‌కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: