మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీ సరికొత్త వ్యూహంతో రాత్రికి రాత్రి సమీకరణాలను మార్చి బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే బిజెపికి ఎన్సిపి నేత మద్దతు ప్రకటించడంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్సీపీ పార్టీ బీజేపీకి మద్దతు పలకలేదని... బీజేపీకి మద్దతు తెలపడం అనే అంశం అజిత్ పవార్ సొంత నిర్ణయం అంటూ శివసేన అధినేత శరద్ పవర్ తెలిపారు. అంతేకాకుండా సరైన ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు. అయితే నేడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. మహారాష్ట్రలో బిజెపి పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునే అవకాశం ఉందని అలాంటి అవకాశం లేకుండా ఈ రోజే బలపరీక్షకు అవకాశం కల్పించాలంటూ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం... మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారి తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధం అంటూ తేల్చి చెప్పింది.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖను సుప్రీంకోర్టుకు రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు సమర్పించాలని కేంద్ర, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. అంతేకాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పై వివరాలను తెలపాలంటూ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది. రేపు సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ ఈ లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక ఈ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు. కాగా దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అనేది ప్రస్తుతం మహా రాజకీయాల్లో ఉత్కంఠ గా మారింది.
ఇదిలా ఉండగా అప్పటివరకు ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివసేన పార్టీ నాయకుడు మహారాష్ట్ర తర్వాత సీఎం అవుతారని మహారాష్ట్ర రాజకీయాల్లో అందరూ అనుకుంటున్న తరుణంలో... రాత్రికి రాత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ nu తమవైపు తిప్పుకొని బిజెపి తెర మీదికి వచ్చి గవర్నర్ అనుమతితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిజెపి వ్యూహంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలు షాక్ కి గురయ్యాయి . బాల్ కోట్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా రాత్రికి రాత్రి మహా రాజకీయ సమీకరణాలు అన్ని మార్చి బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మహా రాజకీయాల్లో సంచలనం మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి