జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఒక సరికొత్త ఎజెండాతో ముందుకు సాగారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ పార్టీ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతూనే ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకుసాగారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే గతంలో జనసేన మద్దతుతో టీడీపీ పోటీ చేయడం తో అధికారంలోకి వచ్చింది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చినాక వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది టిడిపి. అయినప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ అదరలేదు ఎక్కడ బెదరలేదు.
ఇక ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి... టిడిపి ఎన్ని ఇబ్బందులు సృష్టించిన ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని తాము అధికారంలోకి వస్తే పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తన మాటల్లోనే చూపించారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుచుకుని అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ ను ఓడించేందుకు టిడిపి సర్వ ప్రయత్నాలు చేసింది. జనసేన ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఓటు బ్యాంకును చీల్చ వచ్చని టిడిపి భావించింది అంతేకాకుండా కె ఏ పాల్ ను హెలికాప్టర్ గుర్తుతో బరిలోకి దింపడం ద్వారా వైసీపీ గుర్తుకు హెలికాప్టర్ గుర్తుకు పోలిక ఉండడంతో జగన్ కు వచ్చే ఓట్లు కూడా తగ్గిపోతాయని టిడిపి భావించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఎంతమంది ఏకమైనా జగన్ ని మాత్రం అదిరించ లేకపోయారు..తమ అధికారంతో బెదిరించి లేకపోయారు.. తమ ఎత్తులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదురించలేకపోయారు . ప్రతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగారు. చివరికి ఎన్ని పార్టీలు కలిసిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట్రుక కూడా కదిలించలేక పోయారని జగన్ అభిమానులు అనుకుంటున్న మాట. ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా సుపరి పాలన అందిస్తున్నారు సీఎం జగన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి