మేడ్చల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి నెలకొంది. అధికార పార్టీలో మేడ్చల్ మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు అగ్గి రాజేసింది. సోషల్ మీడియాలో నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన ఆడియో రికార్డులు వైరల్ అవుతున్నాయి. బోడుప్పల్ కు చెందిన నేత రాపోలు రాములు, మంత్రి మల్లారెడ్డి మధ్యన ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాపోలు రాములు మంత్రిని తమ తరపు వారికి టికెట్లు ఇవ్వలేదని ఫోన్ లో నిలదీశాడు.
 
"నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు... నీపై నమ్మకం పోయింది" అని రాపోలు నిలదీయగా మంత్రి మల్లారెడ్డి రాపోలు రాములుకు తొందరపడొద్దని నచ్చజెప్పారు. సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ తెగ వైరల్ అవుతోంది. రాపోలు రాములు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మల్లారెడ్డి వ్యవహారమంతా చెబుతానని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కూడా నీ గురించి చెబుతానని రాపోలు రాములు మల్లారెడ్డిని బెదిరించారు. 
 
రాపోలు రాములు అలా బెదిరించగా చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. రాపోలు రాములు ప్రజల మధ్యలో ఉండాలా..? నీ చుట్టూ తిరగాలా...? అని మల్లారెడ్డిని ప్రశ్నించారు.  టికెట్ కొరకు తన వద్ద డబ్బు డిమాండ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయని రాపోలు రాములు అన్నారు. ప్రజల కొరకు తాను జైలుకు కూడా వెళ్లేందుకు సిద్ధమని రాపోలు రాములు చెప్పారు. 
 
మల్లారెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని టికెట్ల విషయంలో సర్వే చెయాలని చెప్పినా వినిపించుకోలేదని తమపై మల్లారెడ్డి బెదిరింపులకు పాలపడుతున్నాడని మీడియాతో అన్నారు. రాపోలు రాములు మంత్రి మల్లారెడ్డి ఒక్కో టికెట్ కోసం 50 లక్షల రూపాయలు వసూలు చేశాడని న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని రాపోలు రాములు అన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం టికెట్లు దక్కనివారు ఆరోపణలు చేయడం సాధారణమే అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: