తొందరలో చంద్రబాబునాయుడు నోరెత్తటానికి కూడా అవకాశం లేకుండా పోతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకాలం అంబానీని తరిమేశారు, అదానీలను వెళ్ళగొట్టారంటూ చంద్రబాబు, లోకేష్ అండ్ కో ఒకటే ఊదరగొడుతున్నారు. కానీ తాజా పరిణామాలు ఇకపై జగన్ గురించి అలా నోరు పారేసుకోవటానికి అవకాశం ఉండకపోవచ్చు.

 

ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. ముఖేఫ్ తో పాటు కొడుకు అనంత అంబానీ, రాజ్యసభ ఎంపి పరిమళ్ నత్వాని కూడా భేటి అవటం చంద్రబాబు తో పాటు మొత్తం పచ్చబ్యాచ్ కు షాక్ కొట్టినట్లైంది. నిజానికి ముఖేష్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రం నుండి ఎక్కడికీ వెళ్ళలేదు. తమకిచ్చిన భూమి లిటిగేషన్లో ఇరుక్కుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే భూమిని ఇవ్వాలంటూ కోరిందంతే.

 

అసలు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట దగ్గర రిలయన్స్ కు లిటిగేషన్ భూమిని అప్పగించిందే చంద్రబాబు. ఆ విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలతో పాటు పచ్చబ్యాచ్ మొత్తం జగన్ వల్లే రిలయన్స్ వెళ్ళిపోయిందంటూ నానా యాగీ చేస్తోంది. ఇపుడు జగన్-ముఖేష్ భేటి అన్నది కేవలం వ్యాపారాభివృద్ధికి సంబంధించినదే అనటంలో సందేహం అవసరం లేదు. ఉన్న వ్యాపారాలను విస్తరిస్తారో లేకపోతే కొత్తగా ఇంకేదైనా యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారా అన్నది ఇపుడే తెలీదు.

 

అలాగే జగన్ దెబ్బకు అదానీ రాష్ట్రం నుండి పారిపోయాడని చంద్రబాబు అండ్ కో చెప్పటంలో కూడా నిజం లేదు. ఒకవేళ పచ్చబ్యాచ్ చెబుతున్నదే నిజమైతే తాజాగా ఓ నేషనల్ హై వే రోడ్డు నిర్మాణం ప్యాకేజీని అదాని కంపెనీ ఎలా దక్కించుకుంటుంది ? అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే కావాలనే పచ్చబ్యాచ్ మొత్తం ఓ వ్యూహం ప్రకారం జగన్ పై బురద చల్లుతున్నారని. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే పచ్చబ్యాచ్ విషప్రచారాన్ని ప్రభుత్వం లేదా వైసిపి తిట్టకొట్ట లేకపోతోందంతే.

 

                                                                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: