నిత్యం బాధలతో కుమిలిపోతున్న స్త్రీలు ఎందరో రగిలిపోతున్నారు. ఏమీ చెయ్యలేక కటిక దరిద్రంలో కూరుకుపోతున్నారు. ఎదురించలేక నోట మాట రాక లోపలే దు:ఖిస్తున్నారు. నిజంగా ఇది దారుణం. ఆడవారిని నీచంగా, హీనంగా చూస్తూ వారిని బాధిస్తోంది సమాజం. ఏమీ చెయ్యలేక వారి ప్రాణాన్ని తీసుకున్న వారు కూడా ఉన్నారు.
 
IHG
 
 
నిత్యం ఏడిపించడం, వేధింపులు, వరకట్న సమస్యలు ఇలా ఏదో ఒక దానికి ప్రతీ రోజు స్త్రీ వీటికి గురవుతోంది. అయితే ఎక్కడో కొంత మంది మాత్రమే ఇటువంటి సమస్యలని ధైర్యంగా ఎదుర్కోగలరు. నిజంగా ఇది దు:స్థితి. అయితే వీటిని ఎదుర్కోవడం ఎంతో ముఖ్యం. అయితే ఒక ఆమె తన సత్తాని ఖండాలు దాటి వినిపిస్తోంది ....మరి ఆమె చేసిన ఘనత అంతా ఇంతా కాదు....ఎంతో చూసేయండి.
 
 
IHG
 
వయస్సులో ఈమె పెద్దది ఏమీ కాదు. కేవలం 22 సంవత్సరాలే. 1997 సంవత్సరంలో పాకిస్థాన్ లో జన్మించింది. 17 ఏళ్ళ వయస్సులో ఈమె నోబెల్ ప్రైజ్ అందుకుంది. ఉగ్రవాదుల అరాచకాలకి గళమెత్తి పోరాడింది ఈ యువతి. భయంకర మానవ మృగాలని ఎదిరిచిన ధీర వనిత మలాల. మలాలా యూసుఫ్ జాయ్ ఉగ్రవాదులని ఎదిరించిన కారణంగా ఆమెపై తాలిబన్ తీవ్రవాదులు తీవ్రంగా దాడి చేసారు.
 
 
IHG
 
 
ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి కోల్కుంది. స్వాత్ లోయలో ఆడవారికి చదువు వద్దు అని వారిని చదువుకోకుండా చెయ్యాలని అన్నారు. 100 కి పైగా ఉన్నా బాలికల భవనాన్ని పేల్చేసారు. ఇలా ఉన్న అతి భయంకర దాడులని ఆపడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అక్కడ ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఘనత ఆమెదే. కానీ ఆ తాలెబన్ వచ్చినా ఆమె క్షమిస్తానని చెప్పింది మలాల.  స్త్రీ విద్య కృషి చేసిన 17 సంవత్సరాల ఆమెకి నిజంగా జోహార్లు..

మరింత సమాచారం తెలుసుకోండి: