2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పథకాలు అమలు విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో  దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే జగన్ సర్కార్ కి ఉపయోగపడతారు అనుకున్న  వారందరినీ ప్రభుత్వ సలహాదారుగా జగన్ మార్చుకున్న విషయం తెలిసిందే. ఏకంగా 20 మంది ప్రభుత్వ సలహాదారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఎదురవుతున్న సమస్యలను మాత్రమే జగన్ సర్కార్ ఎందుకు ఎదుర్కోలేక పోతున్నది అనే చర్చ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో మొదలైంది. 

 

 

 అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ కు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రత్యర్థుల వ్యూహాలను అంచనా వేయకపోవడం... అంతేకాకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ముందుకు సాగడం. ఇలా ప్రతి విషయంలో జగన్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు జగన్ సర్కారు రాంగ్ స్టెప్ వేసిన ఘటనలు కూడా ఉన్నాయి.  చంద్రబాబును విశాఖ ఎయిర్పోర్టులో అడ్డుకోవడం వల్ల ప్రత్యర్థికి కావలసిన మైలేజ్ జగన్ సర్కార్ ఇచ్చిందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా వికేంద్రీకరణ  సంబంధించిన బిల్లును శాసన మండలిలో ఇబ్బందుల గురించి ముందుగా అంచనా వేయకపోవడం. ఇసుక కొరత వల్ల జగన్ కి  చెడ్డ పేరు రావడం..ఇక  మద్యం పాలసీని కూడా ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడం. ఇలా చాలా ఇబ్బందుల్లో జగన్ సర్కార్ కు ఎదురయ్యాయి. 

 

 

 స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా విషయంలోనూ జగన్ సర్కార్ కు  ఇబ్బందులు కలిగించే పరిణామాలు ఎదురయ్యాయి. వైసీపీ నేతలు సహా జగన్ కూడా ఎన్నికల వాయిదా విషయంలో కుల ప్రస్తావన తేవడం ప్రస్తుతం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా స్థానిక సంస్థల నామినేషన్ల విషయంలో  అక్కడ అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై జగన్ సర్కార్ స్పందించక పోవడం కూడా ప్రజల్లో జగన్ సర్కార్ పై నెగిటివిటీ తెచ్చింది. ప్రత్యర్థుల వ్యూహాన్ని జగన్ సర్దార్ అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ప్రతి వ్యూహం రచించి లేకపోతుంది అనే టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు చాణక్యం దెబ్బ తీయాలంటే ప్రత్యర్దులు  కూడా అలాగే ఆలోచించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రభుత్వ సలహాదారులు జగన్ కు సలహాలు ఇస్తున్నారా.. ఒకవేళ ఇచ్చిన వారి సలహాలను జగన్ పాటిస్తున్నారా  అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు జగన్ సర్కార్  సమస్యలను  ఎదుర్కోవడానికి ప్రభుత్వ సలహాదారులే  కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: