నేటి స‌మాజంలో విలువలు దిగజారిపోతున్నాయి. మానవ సంబంధాలు మంత‌గాలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నాయి. మ‌రియు అక్ర‌మ సంబంధాలు చివ‌ర‌కు కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. ప‌ది నిమిషాల సుఖం కోసం ప‌చ్చ‌టి కాపురాన్ని చేతులారా నాశ‌నం చేసుకుంటున్నారు. ఇక తాజాగా త‌న‌ వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్య‌పై ఏకంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ వద్దనే అమానుషంగా దాడి చేశాడు ఓ భార్త‌.

 

ఈ దారుణ ఘ‌ట‌న బుధవారం నాంపల్లిలో చేటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ శివానందనగర్‌లో మహేష్‌, కళావతి అనే భార్య‌భ‌ర్త‌లు నివాసం ఉండేవారు. అయితే క‌ళావ‌తితో మౌనేష్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే క‌ళావ‌తి తన అక్ర‌మ‌సంబంధానికి అడ్డ రాకూడ‌ద‌ని భ‌ర్త మ‌హేష్‌ను చంప‌డానికి ప్లాన్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే భర్త ఇంట్లో నిద్రించే సమయంలో యాసిడ్‌ దాడి చేసింది. ఈ దాడిలో మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 

 

ఇక అప్ప‌టి నుంచీ క‌ళావ‌తి త‌న ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే మ‌హేష్ త‌న‌ను చంప‌డానికి చూసిన క‌ళావ‌తి వ‌ల్ల  పిల్లలు ఉంటే జీవితం నాశనం అవుతుందని, తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని,  లేనిపక్షంలో స్టేట్‌ హోంకు తరలించి చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే దీనిపై బుధవారం విచారణ జరగాల్సి ఉండేది. ఈ విచార‌ణగా మ‌హేష్‌, క‌ళావ‌తితో పాటు మౌనేష్ కూడా వ‌చ్చాడు. 

 

అయితే కళావతి పరిచయం అనంతరం తన భర్త మౌనేష్‌ ఇంటికి రావడం లేదని శాంతి అనే మహిళ  బుధవార‌మే మానవహక్కుల కమిషన్‌కు వచ్చింది. ఈ క్ర‌మంలోనే మౌనేష్‌ను చూసిన శాంతి అక్ర‌మ‌సంబంధం గురించి నిలీదీయ‌గా.. ఆగ్ర‌హించిన మౌనేష్ ఆమెపై దాడిచేశాడు. దాడిలో శాంతి మూతి పండ్లు రాలిపోయాయి. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇది తెలుసుకున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య తన చాంబరులోనికి ఆహ్వానించి సమస్యను తెలుసుకుని ఆగ్ర‌హించారు. దీంతో వెంట‌నే మౌనేష్‌పై క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశాలు జారీ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: