భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైద్యులందరూ అప్రమత్తమై పోయి కరోనా  వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులకు  కూడా ప్రాణభయం పట్టుకుంది. కరోనా వైరస్ సోకిన వారికి వైద్య చికిత్సలు అందించడం ఏమో కానీ ముందు మా  ప్రాణాలు పోకపోతూ  చాలు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే మామూలుగానే భారతదేశంలో ప్రభుత్వాసుపత్రిలో సదుపాయాలు అంతంతమాత్రం గానే ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోగులకు ట్రీట్మెంట్ అందించడం ఏమో కానీ తమ ప్రాణాలను కాపాడుకోవడమే కష్టంగా మారిందని అంటున్నారు వైద్యులు. 

 

 

 తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ హర్యానాకు చెందిన ఓ సీనియర్ డాక్టర్ వాస్తవాలను బయటపెట్టారు. హర్యానాలోని ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్న కామ్నా కక్కర్... తమ ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు ట్రీట్మెంట్లు ఉచితంగానే చేస్తున్నామని తెలిపారు... అయితే కరోనా  వైరస్ బాధితులందరికీ వైద్య చికిత్సలు అందించాలని అంటే ముందుగా తాము బతికి ఉంటే నే చేయగలము  అని చెప్పారు. తమకు కరోనా వైరస్ సోకకుండా  ఉండాలి అంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందరికీ... ఎన్ 95 మాస్క్  లతో పాటు, హజ్ మత్  సూట్ లు , ఫేస్ షీల్డ్ లు  లాంటివి సంరక్షణ వస్తువులు ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు. 

 

 

 అప్పుడే తమని తాము కాపాడుకుంటూ అటు కరోనా  వైరస్ పేషెంట్లకు కూడా సమర్ధవంతంగా చికిత్స అందించగలము అంటూ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ప్రస్తుతం  ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి సదుపాయాలు ఏమీ లేవని... సంపన్న వర్గాలుగా ఉన్న వారు తమను ఆదుకుంటారా  అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు డాక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఆమె పోస్టుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్,  షారుక్ ఖాన్,  అమితాబ్ బచ్చన్,  టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లని  కూడా టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలా సహాయం చేయాలో చెప్పండి మేడం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: