భారతదేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ లో  వున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఉండేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోజురోజుకు భారత దేశంలో పెరిగిపోతున్న కరోనా ప్రభావంవల్ల ప్రజలందరూ ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతున్న క్రమంలో... అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తున్నాయి. ఇలా ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ భారతదేశంలో కరోనా  వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే పరిస్థితి రోజురోజుకూ తగ్గిపోతోంది. 

 

 

 

 దీంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ... ప్రజలందరినీ ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చూసి కరోనా  వైరస్ పై  పోరాటం చేసి విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పటికీ ... ప్రజలు మాత్రం ప్రభుత్వానికి సహకరించడం లేదు. అందరూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. అక్కడ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇంకా నిర్లక్ష్యం నిర్వహిస్తూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్బంధం ప్రకటించినప్పటికీ ఎవరి లో మార్పు మాత్రం కనిపించడం లేదు.. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 101 చేరింది. దీంతో ప్రజలు మరింత భయాందోళన మొదలైంది. అయితే ఎక్కడ కరోనా వైరస్ సోకుతుంది అని భయపడుతూనే ప్రభుత్వం కఠిన నిబంధనలను మాత్రం ఎవ్వరూ పాటించడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా తొలి కేసు నమోదయ్యింది. మణిపూర్లో 23 ఏళ్ల మహిళ కు కరోనా  వైరస్ సోకింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో పరిస్థితి కాస్త చేయి దాటి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: