తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తూ ప్రకటన చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే నిత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇక రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా మూసివేయబడింది. దీంతో ప్రజలకు నిత్యావసరాలు దొరకడం చాలా కష్టం గా మారిపోయింది. 

 

 

 అయితే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని చాలామంది కూరగాయల వ్యాపారులు కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అటు కూరగాయల వ్యాపారులు కూడా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అక్కడక్కడా కొంతమంది వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులపై నిఘా పెట్టడం చేస్తున్నారు. 

 

 

 

 ఇక తాజాగా విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కూరగాయల రేట్లు పై ఆరా తీసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. దీని కోసం స్వయంగా కలక్టర్ లా  వెళ్లకుండా... మారువేషంలో కూరగాయల మార్కెట్ కు వెళ్లారు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్. మారు వేషంలో వెళ్లి మార్కెట్లు తనిఖీ చేశారు. ఓ సామాన్య వ్యక్తి ల మార్కెట్ కి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అక్కడ ధరలు ఎలా ఉన్నాయి... ప్రభుత్వం సూచించిన విధంగా ధరలు ఉన్నాయా..  వ్యాపారులు అధిక ధరలకు అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల సాధారణ ధర కంటే ఐదు రూపాయలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు జాయింట్ కలెక్టర్. అయితే అక్కడికి మారువేషంలో వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకుని కాసేపటికి షాక్ తిన్నారు మార్కెట్ నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: