ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద చిక్కే ఎదురైంది అనే చెప్పాలి. ఆరోగ్య సంస్థ పై అగ్రరాజ్యమైన అమెరికా ప్రస్తుతం పంజా విసరడం మొదలుపెట్టింది.  కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడంలో ఆరోగ్య సంస్థ చాలా ఆలస్యం చేసింది అని అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఆరోపణలు చేయడం జరిగింది. దీనితో పాటు ఆ సంస్థకు అందజేసిన నిధులు అన్నిటిని కూడా ఆపేసినట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలియజేయడం జరిగింది.

 

 

నిజానికి అమెరికా దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎంత నిధులు మంజూరు చేసిందో తెలుసుకుందామా మరి...  ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎక్కువ శాతం నిధులు సమకూర్చేది అమెరికానే. గత సంవత్సరం సుమారు 40 కోట్ల డాలర్లు ను నిధులుగా WHO కు అమెరికా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ నిధులు దాని బడ్జెట్లో 15 శాతం కంటే తక్కువ అనే చెప్పాలి. ఇక చైనా దేశ విషయానికి వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018-19 సంవత్సరానికి గాను 7.6 కోట్ల డాలర్లను అందజేయడం జరిగింది. అంతేకాదు 10 మిలియన్ల డాలర్లు వాలెంటరీ ఫండింగ్ గా ఇచ్చినట్లు ఆరోగ్య సంస్థ తన వెబ్సైట్లో తెలియజేయడం జరిగింది.

 

 

ఇక మరోవైపు ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారినీ అరికట్టేందుకు 675 మిలియన్ డాలర్లు కావాలి అని మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది.  దీంతో పాటు మరో బిలియన్ డాలర్లు అవసరమవుతాయి అంటూ మరో అభ్యర్ధన చేయడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిధులను ఆపివేయడం చాలా అన్యాయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ట్రేడర్స్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం నిధులను ఆపడం సరైన సమయం కాదు అని ఆయన తెలిపారు. ఏది ఏమైనా WHO కరోనాని అడ్డుకునేందుకు రాత్రి పగులు అని తేడా లేకుండా పని చేస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: