ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా  ఒక రేంజ్ లో విజృంభిస్తున్న  ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తో పాటు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి విరుగుడు  కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ప్రపంచ ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అగ్రరాజ్యాలు అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అనే వారు... కానీ ఇప్పుడు మాత్రం దూరంగా ఉంది విడిగా ఉంటేనే కలదు సుఖం అంటున్నారు. 

 


 అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి ఎన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు మాత్రం కొనుక్కోలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ మహమ్మారి కి విరుగుడు కనుగొనేందుకు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఎక్కడ సత్ఫలితాలు మాత్రం ఇవ్వడంలేదు. కానీ తాజాగా  ఈ  వైరస్ కు మందు లభించింది అని ఒక వాదన అమెరికాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గాలంటే దీనికి విరుగుడు తప్పనిసరి. 

 


 ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు లాక్ డౌన్  అమలు చేస్తున్నాయి. దీంతో ప్రపంచం మొత్తం ఈ  వైరస్ విరుగుడు మందు కోసం ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో... ఒకప్పుడు ఒబామా హయాంలో వైరస్ పరీక్షలు చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ట్రంప్  సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కరోనా  వైరస్ కు మందు కనుగొనబడింది అంటూ పలు వివరాలను వెల్లడించారు. ఆయన పేరే ఆంటోనీ ఫౌసి . ప్లేజ్  బో... అనే మందును వాడుతున్నామని వెయ్యి మందికి సంబంధించిన పరీక్షలు చేస్తే ఈ మందు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయిందని... అయితే కొంతమందిలో సత్వరంగా పనిచేస్తుంటే కొంతమందిలో మాత్రం మెళ్ళి గా పనిచేస్తుంది అని అమెరికా పలు కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒకవేళ ఈ మందు కనుక సక్సెస్ అయితే ప్రపంచం మొత్తానికి సంజీవని దొరికినట్టుగా అవుతుంది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: