ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా ఏపీ సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని, విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాం అంటూ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న మద్యం షాపులను రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న దుకాణాలను సంఖ్య కంటే బాగా తగ్గించి పరిమిత సంఖ్యలో మాత్రమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఉన్న ధరల కంటే బాగా పెంచి అమలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు భారీగా పెంచుతాం అని, వాటిని తాగేందుకు భయపడేలా చేస్తానంటూ ప్రకటించారు. 

 

IHG's selfish policies endangering ...


ఆ విధంగానే ఇప్పుడు తన నిర్ణయాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తూ, మద్యం ధరలు అన్యాయం అంటూ మందుబాబులు తరపున వాయిస్ వినిపిస్తున్నారు. మద్యపాన నిషేధం అమలు చేయడం తనకు ఇష్టం లేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుండటంతో మహిళల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు మద్య నిషేధంపై చంద్రబాబు విధానం ఏమిటి అనే ప్రశ్న కూడా ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. మద్యం షాపులు విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఆయన అసూయ, అక్కసుతో చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఈ సమయంలో మద్యం ద్వారా కొంతమేర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. జగన్ ఎన్నికల ప్రచారం లో చెప్పినట్టుగా మద్యం ధరలు పెంచుతాను అని చెప్పిన తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. అంతే కాకుండా మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూసివేస్తే మద్యం అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండడంతో, లాక్ డౌన్ నిబంధనల్లో వీటికి కాస్త సడలింపు ఇచ్చారు. అయితే ఈ విషయం పైన చంద్రబాబు ఒక పక్క విమర్శలు చేస్తూనే, మరోపక్క మద్యం ధరలు పెంచడం అన్యాయం అంటూ మందుబాబులు తరఫున గొంతు పెంచుతున్నారు జగన్. 

 

IHG


 2024 నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని జగన్ అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ చంద్రబాబుకు మద్యపానం నిషేధం అమలు చేస్తే వచ్చిన బాధ ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే, దానికి తూట్లు పొడుస్తూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ లో మద్యపాన నిషేధం విధించడంపై చంద్రబాబు విధానం ఏంటి అనేది స్పష్టంగా మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: